KTR: రేవంత్.. మా ఇళ్లు కూల‌గొట్టు పేదోళ్ల‌ను వ‌దిలేయ్

ktr comments on revanth reddy

KTR: ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీకే భ‌య‌ప‌డ‌లే.. ఇక ఈ చిట్టి నాయుడు ఎంత అని కామెంట్ చేసారు BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న కేటీఆర్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మ‌రోసారి రెచ్చిపోయారు.

ఈ సంద‌ర్భంగా KTR రేవంత్‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై చేసిన కామెంట్స్..

👉 సిగ్గు, శరం, మానం ఉన్నోన్నికి మనం మర్యాద ఇవ్వాలె. ఈ ముఖ్యమంత్రికి అలాంటివి ఏమీ లేవు.

👉 కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్లు కూడా రుణం తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి అన్నాడు.

👉 డిసెంబర్ 9వ తేదీనే రుణమాపీ చేస్తా అన్నాడు. మరి పది నెలలు అయిపోయింది.

👉 మొదటి రోజు సంతకం అన్నాడు. పది నెలలు అయినప్పటికీ ఇప్పటికీ రుణమాఫీ లేదు.

👉 సెక్రటరియేట్ లో లంక బిందెలు అంటాడు. లంక బిందెల కోసం దొంగలు కదా తిరిగేదీ?

👉 ఏడ దేవుడు కనిపిస్తే ఆ దేవుళ్ల మీద ఒట్లు వేసిండు.

👉 ప్రజలు మోసపోయే వాళ్లనే నమ్ముతారని ముందే చెప్పిండు.

👉 చిట్టి నాయుడు కట్టేటోడు కాదు…కూలగొట్టేటోడు.

👉 బోనస్ పేరుతో 500 ఇస్తా అన్నాడు. రైతు భరోసా ఏటా రూ. 15 వేలు ఇస్తా అన్నాడు.

👉 ఇప్పుడు రైతుబంధు లేదు, రైతు భరోసా లేకుండా పోయింది.

👉 అటు కాకుండా, ఇటు కాకుండా ఎటూ కాకుండా పోయింది.

👉 రాష్ట్రంలో అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశాడు.

👉 పెద్ద మనుషులు, మహిళలకు ఫించన్లు అన్నాడు.

👉 బతుకమ్మ చీరలు వచ్చినయా? పండుగ పండుగలా ఉన్నదా?

👉 ఇందిరమ్మ ఇళ్లు కడుతా అంటే ఓట్లు వేసిన్రు. ఇళ్లు కూలగొడుతా అంటే ఓట్లు వేయలేదు.

👉 పది నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా? ప్రజలకు మేలు చేసే పనులు చేశారా?

👉 రుణమాఫీ చేసేందుకు పైసల్లేవంట. కానీ రూ. లక్షా 50 వేల కోట్లు మాత్రం మూసీలో పోస్తడంట.

👉 ప్రజలకు పథకాలు, మంచి చేస్తే కమీషన్లు రావు.

👉 మూసీ ప్రాజెక్ట్ అయితే రూ. 25 నుంచి 30 వేల కోట్లు దోచుకోవచ్చు.

👉 మూసీ ప్రక్షాళన అనేది కేవలం పైసలు దొబ్బేందుకే.

👉 బ్యూటీఫికేషన్ కాదు లూటీఫికేషన్ మాత్రమే.

👉 పేదోళ్లను కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి సీటు కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్ట్.

👉 ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు చెప్పారు.

👉 మీలో ఎవరికైనా భూములు తిరిగి ఇచ్చారా?

👉 ఫ్యూచర్ సిటీ అంట. ఉన్న సిటీని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడుతాడంట.

👉 ఆర్ఆర్ఆర్ కు సంబంధించి మనం కేంద్రం వాటాతో చేయాలని ప్రయత్నించాం.

👉 కానీ ఆర్ఆర్ఆర్ సౌత్ భాగాన్ని రాష్ట్రమే చేస్తదంట. ఎందుకంటే కాంట్రాక్ట్ ల పేరుతో భారీగా డబ్బులు దోచుకునే ప్రయత్నం.

👉 కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా ఆస్మదీయులకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకే.

👉 ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా పనిచేస్తున్నాడు తప్ప.. ముఖ్యమంత్రి లా పనిచేయటం లేదు.

👉 మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల మెదళ్లలోనే ఉంది.

👉 ముఖ్యమంత్రి, మంత్రుల గబ్బు మాటలను ఇక వదిలేది లేదు.

👉 నా మీద అడ్డగోలు మాట్లాడిన మంత్రిని వదిలిపెట్ట. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా.

👉 ముఖ్యమంత్రి మీద కూడా పరువు నష్టం దావా వేస్తా.

👉 గతంలో అపొజిషన్ లో ఉన్నారని ఏది మాట్లాడినా వదిలేశాం. ఇక వదిలేది లేదు.

👉 తప్పు చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఊరుకునేది లేదు.

👉 మోడీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత.

👉 సబితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ లు ఎక్కడ ఉన్నాయో చెప్పు. మేమే కూలగొడుతాం.

👉 మా ఇళ్లను కూలగొడితే నీ కడుపు సల్లపడుతదంటే వాటిని కూల్చు. కానీ పేదల ఇళ్లను వదిలెయ్.

👉 మూసీ బాధితుల గోస చూస్తుంటే బాధ అనిపిస్తోంది. మీరే వాళ్లకు పర్మిషన్ ఇస్తిరి.

👉 50 ఏళ్లు వాళ్ల కట్టిన ట్యాక్స్ లు దొబ్బి తిని పేదవాళ్లను పట్టుకొని కబ్జాదారులు అంటున్నాడు.

👉 ముందు రెడ్డి కుంటలో నీ ఇల్లును, నీ అన్న ఇల్లును కూల్చు.

👉 నీకు పైసలు కావాలె. రాహుల్ గాంధీకి పంపించాలె. మాకు నీ బాధ అర్థమైంది. నీ సీటు కాపాడుకోవాలె అని.

👉 నీకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు ఇస్తాం. కానీ పేదల ఇళ్లను మాత్రం కూలగొట్టకు.

👉 ప్రజలు ఇచ్చిన చందాలు తీసుకెళ్లి నీ సీటు కాపాడుకో.

👉 ఎన్నికల నాటికి ప్రజలు అన్ని మర్చిపోతారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు.

👉 వంద రోజుల్లో చేస్తా అని చేయని వాటిని మొత్తం రాసి పెట్టుకోండి. దానికి మిత్తితో సహా ఇచ్చేలా మనం డిమాండ్ చేయాలె.

👉 బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. ఒక్క చీర కాదు, రెండు చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీరలు కూడా ఇవ్వలేదు.

👉 కనీసం బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు పైసలు కూడా ఇస్తలేడు.

👉 అసెంబ్లీలో సబితక్క సహా మా మహిళ ఎమ్మెల్యేలు నాలుగు గంటలు నిలబడితే కనీసం మైక్ ఇవ్వలేదు.

👉 ఆడబిడ్డలపై కనీసం కనికరం కూడా చూపించలేదు.

👉 గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదని సబితక్క అన్నారు. ఈ మనిషిది రాతి గుండె.

👉 ఈ ముఖ్యమంత్రిని ఒక పెద్దమ్మ తిట్టిన తిట్లు చూసిన తర్వాత ఇదేం జన్మరా అనిపించింది.

👉 ముఖ్యమంత్రిని తిట్టిన తిట్లు వింటే వేరే ఎవరైనా సరే ఎక్కడన్న పడి చస్తుండే.

👉 ముఖ్యమంత్రికి ఏ భాషలో చెబితే అర్థమవుతదో.. ప్రజలు కూడా అదే బాషలో చెబుతున్నారు.

👉 సామాన్యులను ఎక్కువ కాలం మోసం చేయలేవు.

👉 దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు.

👉 రుణమాఫీ అందరికీ అయ్యిందంటే మీ సొంత ఊళ్లో అడుగుదామంటే సప్పుడు చేయలే.

👉 రుణమాఫీ ముందు రూ. 48 వేల కోట్లు అన్నాడు. కేబినెట్ లో రూ. 31 వేల కోట్లు అన్నాడు. బడ్జెట్ లో రూ. 25 వేల కోట్లు పెట్టిండు.

👉 ఆ తర్వాత 18 వేల కోట్లు అన్నాడు. వాళ్ల ఉప ముఖ్యమంత్రే రూ. 7 వేల 500 కోట్లు రుణంమాఫీ చేశాం అన్నాడు.

👉 ఎక్కడ రూ. 41 వేల కోట్లు.. ఎక్కడి రూ. 7500 కోట్లు.

👉 చారాణ రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారు.

👉 ముఖ్యమంత్రి ఇక రాష్ట్రంలో మీరు తిరిగే పరిస్థితి లేకుండా పోతోంది.

👉 కందుకూరు మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంది. అందుకే ఇక్కడ నుంచి మెట్రో పోనిస్తడ అన్నాడు.

👉 ఈ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ సాంక్షన్ చేశాడు. కానీ రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేశాడు.

👉 మా కన్నా ఎక్కువ మంచి పనులు చేసి ప్రజల మనసు గెలిచుకోవాలి.

👉 నా కడుపు, నా ఢిల్లీ నాయకుల కడుపు నిండాలంటే ప్రజలు తిరగబడే రోజు వస్తది.

👉రైతులు రుణమాఫీ అడిగితే మీ మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

👉మీ చిల్లర మాటలు చూసిన తర్వాత రైతులు తిరగబడే పరిస్థితి కచ్చితంగా వస్తుంది.

👉కందుకూరులో మొదలైన రైతు ధర్నా కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది.

👉రైతులకిచ్చిన హామీల విషయంలో నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.

👉ఆరోగ్యం బాగాలేకపోయినా సరే రైతుల కోసం ఇక్కడి రావటం జరిగింది.

👉ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఇతర అవసరాలకు వాడరాదు.

👉ఏడేళ్ల పాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల దగ్గర నుంచి మేము 14 వేల ఎకరాలు సేకరించాం.

👉ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మా సిటీ భూములనే ఫోర్త్ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు.

👉అది ఫోర్త్ సిటీ కాదు. రేవంత్ రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ

👉వాళ్లు మొత్తం లంగలు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములను కూడా లాక్కుంటున్నారు.

👉కోర్టులో ఏమో ఫార్మాసిటీ రద్దు కాలేదని చెబుతున్నారు. బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నాడు.

👉ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

👉ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను వేరే అవసరాలకు వాడితే కోర్టు ఒప్పుకోదు.

👉అందుకే కోర్టును కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

👉ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టులో కేసులు వేయండి.

👉మీ అందరికీ ఒక్క పైసా ఖర్చు కాకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది.