KTR: ఈ జోకర్ రేవంత్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టకూడదు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. తనపై అన్నీ తప్పుడు వార్తలు సృష్టిస్తున్న ఫేక్ న్యూస్ పెడ్లర్ రేవంత్ అని అతన్ని ఎందుకు జైల్లో పెట్టడంలేదని ప్రశ్నించారు.
“” నా బంధువు ఒకరికి 10 వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ దక్కిందని సిగ్గులేకుండా అబద్ధపు వార్త సృష్టించాడు రేవంత్. ఇదే జోకర్ సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలు దోచుకున్నానని అన్నాడు. కేంద్ర మంత్రిపై తప్పుడు వీడియో సర్క్యులేట్ చేయించాడు. ఒక సీఎం పదవిలో ఉండి ఫేక్ OU పోస్ట్ చేయించాడు. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించే ఫేక్ న్యూస్ పెడ్లర్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?“”” అని ట్వీట్ చేసారు