TDPలో చేరిన కోటంరెడ్డి.. వేడుకల్లో కార్యకర్తలకు గాయాలు!

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సోదరుడు.. గిరిధర్‌రెడ్డి ఇవాళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్బంగా కోటంరెడ్డి అనుచరులు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో అక్కడ అపశృతి చోటుచేసుకుంది. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీగా బాణాసంచా కాల్చే క్రమంలో అదుపుతప్పి సమీపంలో ఉన్న కొందరిపైకి బాణసంచా మందు సామగ్రి దూసుకుపోయ్యాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. మరో వ్యక్తికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా చెల్లాచెదురైయ్యారు. ఈ తతంగం అంత టీడీపీ కార్యాలయం ఎదుటే జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు నిర్ఘాంతపోగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన గిరిధర్‌ రెడ్డి..
ఎమ్మెల్యే కోటం రెడ్డి తమ్ముడు గిరిధర్‌ రెడ్డిని చంద్రబాబు సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. వారితో పాటు కోవూరు, గూడూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాల వైసీపీ నేతలు, తదితరులు పసుపు కండువాలు ఇవాళ కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డి లాంటి వారు పార్టీలోకి రావడంవల్ల ఇంకా పార్టీ బలం పెరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని.. గిరిధర్ లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్యకార్యకర్తలు ఎలా ఉంటారు? జగన్ నమ్మినవారిని నట్టేట ముంచేరకం అని బాబు ఎద్దేవా చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. జగన్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. సైకో పోవాలి… సైకిల్ రావాలనే నినాదం మారుమోగుతోందన్నారు. . సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. మొన్న చదువుకున్న వాళ్లు తమ పార్టీకి ఓటేయలేదని అన్నాడు. మరినిన్న సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయలేదు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై కూడా తిరగబడ్డారన్నారు. గిరిధర్ రెడ్డి యువకుడు.. ఉత్సాహవంతుడు. ప్రజలకు సేవచేయాలని తపనపడేవాడు. అలాంటి వ్యక్తిని వైసీపీ వద్దనుకుందని.. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతిఒక్కరికీ మరోసారి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. అయితే.. బాణసంచా కాలుస్తూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు బాబు సూచించారు. కార్యకర్తలు ఉత్సాహంతో బాణసంచాకాలిస్తే, నలుగురుకి గాయాలయ్యాయి. బాణసంచా కాలి గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. వైద్యులతో మాట్లాడి, వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరాన్నారు. మనకోసం వచ్చినవారికి అలా జరగడం నిజంగా చాలా బాధగా ఉంది అని చంద్రబాబు నాయుడు అన్నారు.

వచ్చేఎన్నికల్లో నెల్లూరులో 10 స్థానాలు గెలుస్తాం : కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
“తెలుగుదేశం కుటుంబంలో నన్ను భాగస్వామిని చేసిన చంద్రబాబుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే టీడీపీలో చేరాను. నెల్లూరుజిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను వచ్చేఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది. మాతోపాటు మమ్మల్ని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు’ అని గిరిధర్‌ రెడ్డి పేర్కొన్నారు.