Komatireddy Venkat Reddy: సీత‌క్క సీఎం అనేది పెద్ద జోక్

Hyderabad: TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (rebvanth reddy) అమెరికాలో చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (komatireddy venkat reddy). అస‌లు రేవంత్ అమెరికా వెళ్లాక ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థంకాలేద‌ని అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క (mulugu mla seethakka) సీఎం అని రేవంత్ (revanth reddy) అన‌డం పెద్ద జోక్ అని గిరిజనులకు సీఎం ప‌ద‌వి ఇవ్వాలి అంటే 3 సార్లు గెలిచిన పొడెం వీరయ్యకి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) అన్నారు. తానా (tana) స‌భ‌లో పాల్గొనేందుకు కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లిన రేవంత్ అక్కడి తెలుగు వారితో మాట్లాడుతూ తెలంగాణ రైతుల‌కు 3 గంట‌లు క‌రెంట్ ఇస్తే చాల‌ని వారికి ఉచిత క‌రెంట్ అవ‌స‌రం లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. దీనిపై BRS స్పందిస్తూ.. ఇలాంటి నీచ‌పు బుద్ధి ఉన్న కాంగ్రెస్ (congress) మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌లు అంధ‌కారంలోకే పోతారు అని మండిప‌డింది.