Kolkata Doctor Rape: ఎగ్ నూడుల్స్ కావాలంటూ నిందితుడి రచ్చ‌

kolkata doctor rape case accused sanjay roy demanding egg noodles in jail

Kolkata Dcotor Rape: క‌ల‌క‌త్తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడిగా ఉన్న సంజ‌య్ రాయ్ జైల్లో గొంతెమ్మ కోరిక‌లు కోరుతున్నాడు. ప్ర‌స్తుతం సంజ‌య్ రాయ్‌ని ప్రెసిడెన్సీ క‌రెక్ష‌న‌ల్ హోంలో ఉంచారు. అయితే సాధార‌ణంగా రిమాండ్‌లో ఉన్న ఖైదీల‌కు చపాతీలు కూర పెడ‌తారు. సంజ‌య్‌కి కూడా అదే పెడుతున్నారు. కానీ నిన్న రాత్రి సంజ‌య్ త‌న‌కు చ‌పాతీలు వ‌ద్ద‌ని ఎగ్ నూడుల్స్ కావాల‌ని ర‌చ్చ చేసాడ‌ట‌. దాంతో పోలీసులు త‌మ స్టైల్‌లో సంజ‌య్‌కు న‌చ్చ‌జెప్ప‌డంతో అన్నీ మూసుకుని రోటీలు తిని ప‌డుకున్నాడ‌ట‌. ఇంకా ఈ కేసును సీబీఐ విచారణ చేప‌డుతూనే ఉంది.