Indian Flag: మన జెండా గురించి ఈ విషయాలు తెలుసా?
Hyderabad: 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన జాతీయ జెండాకు (indian flag) సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
*మన దేశంలో మొదటి జాతీయ జెండాను ఎగరవేసింది 1906 ఆగస్ట్ 7న. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలోని పార్సీ బగన్ స్క్వేర్ (ఇప్పుడు గ్రీన్ పార్క్) వద్ద జెండాను మొదటిసారి ఎగరవేసారు. అఫీషియల్‌గా అయితే 1947 ఆగస్ట్ 15న ఎగరవేసారు.
*2004లో సుప్రీంకోర్టు స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేసి మరీ దేశభక్తిని చాటుకోవాలని వెల్లడించింది. (indian flag)
*రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణ మన జాతీయ గీతానికి మొదట భారత భాగ్య విధాత అనే పేరును పెట్టారట. ఆ తర్వాత జనగణ మన అని మార్చారట.
*మన మొదటి జాతీయ జెండాను డిజైన్ చేసింది 1904వ సంవత్సరంలో. స్వామీ వివేకానందకు పరమ భక్తురాలైన సిస్టర్ నివేదిత మన జాతీయ జెండాను డిజైన్ చేసారు.
*మన చట్టం ప్రకారం.. దేశంలో జాతీయ జెండాను ఎవరైనా తయారుచేయాలంటే ఖాదీతోనే తయారుచేయాలి. జెండాను నేయడానికి కావాల్సిన ఖాదీని కర్ణాటకకు చెందిన గ్రామోద్యోగ సంయుక్త సంఘం సప్లై చేస్తుంది.
*ధర్మాన్ని సూచించే అశోక చక్రం ఈ సైజులో ఉండాలని ఎవ్వరూ చెప్పలేదు. ఆ అశోక చక్రం డిజైన్ చేయడానికి ఎలాంటి కొలతలు అవసరం లేదు. (indian flag)
*కానీ జాతీయ జెండా కొలత మాత్రం 2:3 రేషియోలో ఉండాలి. జెండాలోని మూడు రంగులకు సమానమైన కొలత ఉండితీరాలి.
*మన దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించింది అట్టారీ- వాఘా బోర్డర్లో. 110 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, 55 టన్నుల బరువు ఉన్న జెండాను ఎగరవేసారు. (indian flag)