Kasani Gnaneshwar: కారెక్క‌నున్న కాసాని..!

Telangana Elections: తెలుగు దేశం పార్టీ తెలంగాణలో పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో TTDP అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ (kasani gnaneshwar) త‌ల‌ప‌ట్టుకున్నారు. తెలంగాణ‌లో TDP పోటీ చేస్తుంద‌న్న ఆశ‌తో ఉన్న ఆయ‌న‌కు అసంతృప్తే మిగిలింది. దాంతో ఇక తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ ప‌ని అయిపోయిన‌ట్లే అని భావించిన కాసాని BRS పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు సీఎం KCR సమక్షంలో BRS పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు.