karnataka elections: బీజేపీ కార్యకర్తలకు మోదీ క్లాస్‌

bengaluru: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు(karnataka elections) దగ్గరపడుతున్నాయి. ఈక్రమంలో ప్రచారంతో ప్రజల్ని ఆకర్షించడం ఒక ఎత్తైతే.. వాటిని ఓట్లుగా మరల్చడం.. మరో ఎత్తు. అంటే.. ఓటు వేయడానికి వచ్చే ప్రజల్ని దగ్గరుండి మేనేజ్‌ చేస్తూ.. తమ పార్టీకి ఓటు వేసేలా చేయడం పోల్‌ మేనేజిమెంట్‌లో ఓ భాగం. ఇక ఈ అంశంపై బీజేపీ(bjp) కార్యకర్తలకు ప్రధాని మోదీ(pm modi) గైడెన్స్‌(guidence) ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్బంగా కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బీజేపీ గెలుపుకు బూత్‌ లెవెల్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యమని మోదీ తెలిపారు. మోదీ. ఓటర్లను పోలింగ్‌ బూత్‌ దగ్గరకు తీసుకొచ్చే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కార్యకర్తలు విజయం సాధిస్తే పార్టీ గెలుపు ఖాయమన్నారు. కర్నాటకలో శనివారం మోదీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తారు. బెంగళూర్‌లో 4 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహిస్తారు.