karnataka: కుల రాజకీయాలదే హవా..? సర్వేలు ఇదే చెబుతున్నాయి!
bengaluru: కర్నాటకలో బలమైన సామాజిక వర్గాలు.. లింగాయత్(Lingayats )లు, వొక్కలిగలు(vokkaligas). వీరే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయిస్తుంటారు. కన్నడ జనాభాలో లింగాయత్‌లు 17శాతం వరకు ఉండగా… వొక్కలిగలు 12 నుంచి 14 శాతం వరకు ఉంటారు. ఇందులో లింగాయత్‌లు ఇతర వర్గాలపై కూడా కొంత ప్రభావం చూపగలరు. కర్నాటకలో లింగాయత్ కమ్యూనిటీ వారికి మఠాలు, ఆశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. అందుకే సమాజంలో లీడింగ్ కమ్యూనిటీగా వారిని పిలుస్తుంటారు.
ఇక తాజాగా ఎన్డీటీవీ లోక్‌నీతి – సీఎస్డీఎస్ ఓటర్ సర్వేలో కర్నాటకలోని సామాజిక వర్గాలు ఏఏ పార్టీల వెంట ఉన్నారు అనే విషయం తేలింది. సర్వే సంస్థ 21 నియోజకవర్గాల నుంచి 2,143 మంది ఓటర్లను సర్వేలో భాగస్వామ్యం చేసింది. వొక్కలిగలు ప్రధానంగా కాంగ్రెస్(congress), హెచ్డీ కుమార స్వామి(kumar swamy)కి చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)(jds)కు మద్దతు ఇచ్చారు. వీరిలో 34% మంది కాంగ్రెస్‌ను సపోర్ట్ చేయగా, 36% మంది జేడీ(ఎస్)కు అనుకూలంగా ఉన్నామని చెప్పారు. 30% మంది ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్నారు.
లింగాయత్‌లలో 67% మంది బీజేపీ(bjp)కి అనుకూలంగా ఓటేశారు. 33% మంది ఇతర పార్టీలకు జై కొట్టారు. ఇక ముస్లింలలో 59% మంది కాంగ్రెస్‌కు ఓటేయగా.. 41% మంది ఇతర పార్టీలకు అనుకూలంగా నిలిచారు. ఇక.. వొక్కలిగలు మొత్తం 58 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. ఇక్కడ పోటీ చేసిన బీజేపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ అంతిమంగా వొక్కలిగలు ఓట్లు చీల్చుతుంటే.. లింగాయత్‌లు వన్‌సైడ్‌గా బీజేపీ వైపు, ముస్లింలు గంప గుత్తగా కాంగ్రెస్‌కు ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. లింగాయత్ ఓటర్లందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వొక్కలిగలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ హైకమాండ్ లింగాయత్ లీడర్లను బరిలోకి దించింది. రాజకీయ, ఆర్థిక, సామాజికపరమైన భరోసా ఇస్తామంటూ వొక్కలిగల ఓట్లు పొందేందుకు బీజేపీ పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది.