Karan Johar: టాలీవుడ్‌ని పొగిడాడా.. తిట్టాడా?
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (karan johar) ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ఆయన కావాలని అలా మాట్లాడతారో లేదా ఇతరులు వాటిని వివాదాస్పదంగా మారుస్తారో తెలీదు కానీ కరణ్ చేసే కామెంట్స్ ఎప్పుడూ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏకంగా మన టాలీవుడ్‌ని (tollywood) టార్గెట్ చేసాడు.
బాలీవుడ్‌లో చాలా మటుకు మగవారి ఆధిపత్యాన్ని చూపించేందుకు హీరోయిన్స్‌పై చేయిచేసుకునే సీన్లు పెడుతున్నారన్న విషయంపై కరణ్ స్పందించారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కబీర్ సింగ్ (kabir singh) నుంచి ఈ రచ్చ మొదలైంది. దీనిపై కరణ్ మాట్లాడుతూ.. అసలు తమకు ఈ టాక్సిక్ రోల్స్ గురించి తెలీనే తెలీదని.. టాలీవుడ్‌లో వచ్చిన పుష్ప (pushpa), కన్నడ నుంచి వచ్చిన KGF సినిమాల నుంచే అలా మగవారి ఆధిపత్యం అనే అంశం గురించి తెలుసుకున్నామని అన్నారు. పుష్ప, KGF సినిమాలు పెద్ద హిట్లు అవ్వడంతో అలాంటి రోల్స్‌ని బాలీవుడ్‌లో కూడా తీసుకొస్తున్నామని తెలిపారు. (karan johar)
“” ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద హీరో సినిమా అనే కాన్సెప్టే లేదు. కేవలం కంటెంటే గెలుస్తోంది. నిజానికి బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ అడుగుజాడల్లో నడుస్తోంది. పుష్ప, KGF లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందుకే మేం కూడా అలాంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నాం. సౌత్ దర్శకులకు ఆడియన్స్ నాడి తెలుసు. ఆ విషయంలో మేం ఓడిపోయాం. ఇప్పుడు దర్శకులకు ఏం చేస్తే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారో తెలీదు. నాక్కూడా తెలీదు. సౌత్ ఇండస్ట్రీని చూసి నేర్చుకుంటున్నాం “” అని తెలిపారు.