Kantara: ఇప్పుడు ఇంగ్లీష్‌లోనూ!

చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన సినిమా కాంతార. కన్నడలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమానూ హోంబలే సంస్థ నిర్మించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవం దక్కించుకుంది. జెనీవా (స్విట్జర్లాండ్ )లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో మార్చి 17న ఈ సినిమాను ప్రదర్శించారు. హిందీలోనూ విడుదలై ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్​ ప్రైమ్​లో అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాను త్వరలోనే ఇంగ్లీష్​తోపాటు పలు భాషల్లోకి అనువదించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అతి త్వరలోనే స్పానిష్, ఇటాలియన్ విదేశీ భాషల్లో థియేట్రికల్‌గా రిలీజ్ చేయనున్నారట మేకర్స్​. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటన కూడా చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు. రిషబ్​కు జోడిగా సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. 2022 అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంది.

కాంతార డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో అందుబాటులో ఉండగా.. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలను నిర్మాతలు ఇంగ్లీష్‌లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఆ ఇంగ్లీష్ వర్షన్ థియేటర్స్‌లో విడుదలకానుందా లేక ఓటీటీకే పరిమితం కానుందని తెలుస్తోంది. తెలుగు , తమిళ, కన్నడ వర్షన్స్‌ అమెజాన్ ప్రైమ్‌లో ఉంటే.. హిందీ వర్షన్ 2022 డిసెంబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అంతేకాదు ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ కూడా జనవరిలో నెట్ ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్​ కానుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్​.