Kalki 2898 AD: మ‌ళ్లీ అదే రిలీజ్ డేటా?

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న క‌ల్కి 2898 AD (kalki 2898 ad) సినిమా టీజ‌ర్ గూస్‌బంప్స్ తెప్పించేసింది. ఫ‌స్ట్ లుక్ చూడ‌గానే ఈ ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు. కానీ టీజ‌ర్‌తో అంచ‌నాల‌ను అమాంతం పెంచేసారు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ (nag ashwin). ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక అప్డేట్ వ‌చ్చింది. సినిమాను 2024 మే 9న రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఎందుకంటే.. సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న వైజ‌యంతి మూవీస్ (vyjayanthi movies) సంస్థ‌కు మే 9 అనేది బాగా క‌లిసొచ్చిన డేట్ అంట‌. ఈ సంస్థ తీసిన మ‌హానటి, మ‌హ‌ర్షి సినిమాలు అదే డేట్‌రి రిలీజ్ అయ్యాయి.

అయితే మ‌హాన‌టి, మ‌హ‌ర్షి బిగ్ బ‌డ్జెట్ సినిమాలేం కావు. పైగా మ‌హ‌ర్షి రిలీజ్ అయిన రోజే అవెంజ‌ర్స్ రిలీజ్ అయ్యింది. ఆ ఎఫెక్ట్ మ‌హ‌ర్షిపై కూడా ప‌డింది. ఇక 2024 మే 9న మిష‌న్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్ పార్ట్ 2 రిలీజ్ అవ‌బోతోంది. అలాంట‌ప్పుడు క‌ల్కిని (kalki 2898 ad) రిలీజ్ చేసి రిస్క్ చేస్తున్నార‌ని కొంద‌రు ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే మే 9 అనేది క‌న్ఫామ్ అయిన డేట్ అయితే కాద‌ని తెలుస్తోంది.