Jasprit Bumrah: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బుమ్రా భార్య
Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత విరామం తర్వాత రాజ్ కోట్ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. అయితే , వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన భార్యతో కలిసి విడుదల చేసిన ఒక ప్రమోషనల్ వీడియో నేపథ్యంలో వారిపై ట్రోల్స్ మొదలయ్యాయి.
జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ (Sanjana Ganesan) సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ బాధితురాలిగా మారింది. ఆ తర్వాత, సంజన ఒక వినియోగదారు నుంచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, ఈ విషయంలో సంజన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ వినియోగదారుని వదిలిపెట్టలేదు. ఏకిపారేసింది. సంజన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంజనా గణేశన్ ఇటీవల ఒక కొడుకుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బరువు మునుపటిలా పెరిగింది. సంజన ఈ వీడియోపై ఒక యూజర్ ఆమెను లావుగా ఉన్నావంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. సంజన.. ఆ యూజర్‌కి రిప్లై ఇస్తూ.. మీకు స్కూల్ సైన్స్ పాఠ్యపుస్తకం కూడా గుర్తుండదని, పెద్ద పెద్ద ఆడవాళ్ల శరీరాల గురించి వ్యాఖ్యానిస్తుంటారని ఫైర్ అయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ యూజర్‌పై విరుచుకపడింది.
ALSO READ: Ravindra Jadeja: కుటుంబంలో కలహాలు.. అసలేం జరిగింది?
సంజన వీడియోపై వ్యాఖ్యానిస్తూ, రాజా రాయ్ అనే వినియోగదారు “భాభి లావుగా కనిపిస్తున్నావు” అంటూ రాసుకొచ్చాడు. సంజన వీడియోపై ఈ యూజర్ మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ అనే వినియోగదారుడు సోదరా, ఆమె చాలా లావుగా మారింది. ఇంతకు ముందు ఇలా లేదు అంటూ మాట్లాడుకున్నారు. దీంతో ఆమె సమాధానంపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. సదరు నెటిజన్ తిక్క కుదిర్చారని రాసుకొస్తున్నారు. కాగా నెటిజన్ల ట్రోలింగ్‌కు కౌంటరివ్వడం సంజనా గణేషన్‌కు ఇది మొదటిసారి ఏంకాదు. 2022లో కూడా ఓ నెటిజన్‌కు ఇలాంటి కౌంటరే ఇచ్చారు.
సంజనా గణేశన్ స్పోర్ట్స్ యాంకర్ అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుమ్రాను పెళ్లి చేసుకోకముందే ఆమె గురించి జనాలకు తెలుసు. బుమ్రాతో రిలేషన్షిప్ తరువాత, వారిద్దరూ మార్చి 2021 లో వివాహం చేసుకున్నారు. బుమ్రా, సంజన గతేడాది సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. వీళ్లకు కొడుకు పుట్టాడు.
గాయం కారణంగా కొంతకాలంపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నా బుమ్రా రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టుకు రెడీ అవుతున్నాడు. భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో మరో మూడు టెస్టు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టులో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ విజయం సాధించింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా అతనికే దక్కింది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.