Janhvi Kapoor: ఆ పని చేయనని అమ్మకు మాటిచ్చాను
Janhvi Kapoor: జాన్వి కపూర్ తొలి సినిమా చేస్తున్న సమయంలో అందాల తార శ్రీదేవి ఈలోకాన్ని వీడి వెళ్లిపోయారు. తన బిడ్డ తొలి సినిమాను చూడలేకపోయారు. తన తల్లి పక్కన లేనప్పటికీ ఆమె చెప్పిన ప్రతీ మాట గుర్తుందని ఎవ్వరి కోసమూ ఆ మాటను మాత్రం తప్పనని అన్నారు జాన్వి. సినిమా కోసం ఏదన్నా చెయ్యి కానీ జుట్టు మాత్రం కత్తిరించుకోకు అని శ్రీదేవి తనకు చెప్పినట్లు జాన్వి తెలిపారు.
తన తొలి సినిమా దఢక్ సమయంలో కాస్త జుట్టు కత్తిరించుకున్నందుకు ఎంతో తిట్టిందని.. అప్పుడే ఏ సినిమా కోసమూ జుట్టు మాత్రం కత్తిరించుకోనని తన వద్ద మాట తీసుకుందని జాన్వి అన్నారు. “” మా అమ్మకు నా జుట్టంటే ఎంతో ఇష్టం. నా జుట్టుని చూసి గర్వపడుతూ ఉండేది. ప్రతి మూడు రోజులకోసారి నూనె రాసి మర్దన చేస్తుండేది. అసలు జుట్టు కట్ చేస్తే ఒప్పుకునేది కాదు. అలాంటిది నా కొత్త సినిమా ఉలజ్ కోసం దర్శకుడు జుట్టు కత్తిరించుకోవాలని అన్నాడు. అస్సలు కుదరదు అని నేను గొడవపడ్డాను. నా మాటకు విలువిచ్చి నా హెయిర్ స్టైల్‌ని మార్పించారు. మా అమ్మకు ఇచ్చిన మాటను ఏ సినిమా కోసమూ నేను తప్పలేను “” అని తెలిపారు.