Jagan: రిచెస్ట్ సీఎంలలో జగనే టాప్!
Delhi : దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నులు(richest cm’s in the country) ఎవరూ అని ఓ సంస్థ సర్వే చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ys jagan) టాప్ పొజిషన్(top place) దక్కించుకున్నారు. అంతేకాదు.. దేశంలో ఉన్న 30 మంది ముఖ్యమంత్రులతో దాదాపు 29 మంది సంపన్నులేనని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 510 కోట్లు విలువైన ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక లిస్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(దీదీ)(west bengal cm mamata banerjee) నిలవడం గమనార్హం. ఆమె పేరిట కేవలం 15 లక్షలే ఉన్నాయట. ఈ విషయాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(association for democratic reforms)- ఏడీఆర్(adr), నేషనల్ ఎలక్షన్ వాచ్ (new) అనే సంస్థలు కొంత వివరాలు సేకరించి ఈ మేరకు నివేదికలను విడుదల చేశాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు చెబుతున్నాయి.
దేశంలోని 28 రాష్ట్రాల సీఎంలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి సీఎంల ఆస్తులను వారు విశ్లేషించారు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96 కోట్లు వరకు ఉందని వారు పేర్కొన్నారు. అందులో ఏపీ సీఎం జగన్ రూ.510కోట్లు, అరుణాచల్ సీఎం ఖండూ రూ.163 కోట్లు, ఒడిశా నవీన్ పట్నాయక్ రూ.63 కోట్లు.. అత్యంత ఆస్తి కలిగిన ముగ్గురు సీఎంలుగా ఉన్నారు. బెంగాల్ సీఎం మమతా రూ.15 లక్షలు, కేరళ సీఎం పినరయి కోటి రూపాయలు, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ.కోటి పైన.. ఆస్తులు కలిగి.. అతి తక్కువ ఆస్తి కలిగిన సీఎంలుగా నిలిచారు. ఇక తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు ఆస్తి విలువ రూ.23.55కోట్లు ఉందని తెలిపారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి రూ.3 కోట్లకుపైగా ఉందన్నారు.