బోరుగడ్డ అనిల్‌తో వీడియో కాల్ అడిగిన జగన్.. కుదరదని చెప్పిన పోలీసులు
Borugadda Anil: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు అతన్ని విచారించగా.. రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆశపెట్టడంతో ప్రతిపక్ష నేతలపై ధూషణలు చేసానని విచారణలో ఒప్పుకున్నారు. అతనికి గుంటూరు కోర్టు 13 రోజుల పాటు రిమాండ్ విధించగా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అనిల్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకసారి వీడియో కాల్ మాట్లాడతానని రిక్వెస్ట్ చేయించారు. ఇందుకు పోలీసులు ఒప్పుకోలేదు.