Jagan: షర్మిళ మోసం చేసి షేర్లు రాయించుకుంది
Jagan: వైఎస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైఎఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. తన చెల్లెలు వైఎస్ షర్మిళపై NCLTలో (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్) పిటిషన్ వేసారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఆయన పిటిషన్ వేయగా.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2019 ఆగస్ట్‌లో సరస్వతి కంపెనీ షేర్లలో తనకు తన భార్య భారతికి 51.01% వరకు వాటా ఉందని.. ఆ షేర్లను ప్రేమతో తాను తన తల్లి విజయమ్మ పేరిట రాస్తే షర్మిళ మోసం చేసి ఆ షేర్లను విజయమ్మ నుంచి తన పేరిట రాయించుకుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు ఒప్పుకున్న విజయమ్మ పేరును కూడా నిందితురాలిగా జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణ నవంబర్‌లో విచారణ జరగనుంది.