ISRO: అంత‌రిక్షంలోకి ప్రధాని..!

isro wants to send narendra modi to space

ISRO: గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు ఇస్రో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇంకొన్నేళ్ల‌లో ఇది పూర్త‌వుతుంది. ఈ మిష‌న్ ద్వారా మ‌నుషుల‌ను స్పేస్‌కి పంపించే అవ‌కాశం ఉంటుంది. అయితే.. మొద‌టి లాంచ్‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పంప‌గ‌లితే ఇస్రోకి అంత‌కుమించిన గ‌ర్వ‌కార‌ణం మరొక‌టి ఉండ‌దు అని ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ తెలిపారు. మోదీకి ఎన్నో ప‌నులు ఉన్న‌ప్ప‌టికీ.. స‌మ‌యం ఉన్న‌ప్పుడు తాము నిర్మించిన గ‌గ‌న్‌యాన్ ద్వారా అంత‌రిక్షానికి వెళ్లి వ‌స్తే త‌మ‌కు అంత‌కుమించిన సంతోషం మ‌రొక‌టి ఉండ‌దు అన్నారు.