అడిగినంత ఇస్తేనే ‘దేశముదురు’ రీరిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సినిమా దేశముదురు. బన్నీకి కెరీర్ పరంగా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు బాగా చేరువై ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బన్నీ. హన్సికా మోత్వాని తెలుగు పరిశ్రమకు ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యారు. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఓ సంచలనం. దివంగత సంగీత దర్శకుడు చక్రీ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక, అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ఏప్రిల్ 7న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా స్పెషల్ షోకి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట నిర్మాత దానయ్య.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయా హీరోల బర్త్ డే సందర్భంగా, వారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘దేశముదురు’ కూడా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్నాళ్లుగా టాలీవుడ్ టాప్ హీరోల బర్త్‌డే స్పెషల్‌గా వారి సూపర్‌హిట్ సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా దేశముదురు సినిమాని ఏప్రిల్ 7న పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త టెక్నికల్ హంగులు అద్దుతున్నట్లు సమాచారం. ఈ సినిమా రీ రిలీజ్ గురించి నిర్మాత డీవీవీ దానయ్యతో చర్చలు కొనసాగుతున్నాయట. అయితే, ఈ సినిమా విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమా విడుదల చేయాలని బన్నీ అభిమానులు పట్టుబడుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ఈ సినిమా సీక్వెల్ కోసం బాగా కష్టపడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా విడుదలైన ప్రతి చోటా సంచలన విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా బ్లాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది.