మ‌రో పాకిస్థాన్‌

is canada the new pakistan

Canada: కెన‌డా మ‌రో పాకిస్థాన్‌గా మారుతోందా? కెన‌డా ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే అలా అనుకోకుండా ఉండ‌లేం. భార‌త్‌పై ఊరికే నోరు పారేసుకోవ‌డం.. నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం కెన‌డాకు అల‌వాటైపోయింది. భార‌త్‌లో ఏ రాజ‌కీయ నాయ‌కుడో, రౌడీ షీట‌రో హ‌త్య‌కు గురైతే.. కెన‌డాలో నిజ్జ‌ర్‌ను కూడా ఇలాగే చంపేసారా అని వెంట‌నే ఆరోప‌ణ‌ల‌కు సిద్ధ‌మైపోతున్నారు కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో. ఓ ర‌కంగా చెప్పాలంటే ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్ మాదిరిగానే ఇప్పుడు కెన‌డా త‌యారైంది. ఓటు బ్యాంక్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌టం.. సొంత భ‌ద్ర‌త‌ను డ్యామేజ్ చేసుకోవ‌డం ఇవ‌న్నీ పాకిస్థాన్‌కు ఉన్న అల‌వాట్లు. ఇప్పుడు ఇవే అల‌వాట్లు కెన‌డాలో క‌నిపిస్తున్నాయి.

కొంత‌కాలంగా నిజ్జ‌ర్ హ‌త్య కేసులో భార‌త్‌ను అనుమానిస్తున్న కెన‌డాకు భార‌త్ బుద్ధి చెప్పింది. కెన‌డాలో ఉంటున్న భార‌త దౌత్యాధికారుల‌ను వెనక్కి పిలిపించేసుకుని.. ఇక్క‌డ ప‌నిచేస్తున్న కెన‌డా దౌత్యాధికారులను కెన‌డాకు పంపిచేసింది. గ‌తంలో ఇదే మాదిరిగా భార‌త్ పాకిస్థాన్‌తో వ్య‌వ‌హ‌రించింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌స్తుతం భార‌త్‌కు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధం కంటే కెన‌డాతో ఉన్న బంధం మ‌రింత చెడింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు. భార‌త్‌కు వ్య‌తిరేకులైన ఖలిస్తానీ ఉగ్ర‌వాదానికి కెన‌డా మ‌ద్ద‌తు తెల‌ప‌డ‌మే ఇందుకు కార‌ణం.

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదైన హ‌ర్దీప్‌సింగ్ నిజ్జ‌ర్‌ని ఎవ‌రో చెంపేసే ఆ నేరాన్ని కెన‌డా భార‌త్‌పై రుద్దాల‌ని చూస్తోంది. మొన్న ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హ‌త్య‌కు గురైన నేప‌థ్యంలో ఆ హత్య‌ను తామే చేసామ‌ని గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ వ‌ర్గం ప్ర‌క‌టించింది. దాంతో నిజ్జ‌ర్‌ను కూడా కెన‌డాలో ఇలాగే చంపించేసారా అని జ‌స్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. దాంతో భార‌త్‌కు ఒళ్లు మండింది. మేమే చేసాం అన‌డానికి ఆధారాలున్నాయా అని భార‌త్ ప‌లుమార్లు అడిగినా అబ్బే ఆధారాలు లేవు కేవ‌లం ఆరోప‌ణ‌లే అని కెన‌డా త‌న ప‌రువు తానే తీసుకుంది.

కెన‌డా నుంచి కార్య‌క‌లాపాలు చేప‌డుతున్న ఖ‌లిస్తానీ వ‌ర్గాల్లో చాలా మ‌టుకు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాదులే ఉన్నారు. భార‌త్‌లో దాడులు చేసి.. చేయాల‌ని చూస్తున్న ఉగ్ర‌వాదులు పాకిస్థాన్‌లోనూ ఉన్నారు. మ‌రి కెన‌డాకు పాకిస్థాన్‌కి తేడా ఏంటి అని భార‌త్ నిల‌దీస్తోంది. ప్ర‌ముఖ పంజాబీ గాయ‌కుడైన సిద్ధూ మూసేవాలాను చంపిన గ్యాంగ్‌స్ట‌ర్ గోల్డీ బ్రార్ కూడా కెన‌డాలోనే త‌ల‌దాచుకున్నాడు. అత‌న్ని ప‌ట్టించాల‌ని భార‌త్ కెన‌డాను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ప‌ట్టించుకోలేదు. పాకిస్థాన్ స్పై ఏజెన్సీ అయిన ISIకి చెందిన ఉగ్ర‌వాదులు కూడా కెన‌డాలో విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. వారి సంగ‌తేంటి అని అడిగితే.. దానీక సమాధానం చెప్ప‌రు. మ‌రి ఏ ర‌కంగా సిగ్గులేకుండా కెన‌డా భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు? కెన‌డా త‌తంగం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్న‌ట్లుంది.

Canada: కెన‌డాలో సిక్కుల ఓటు బ్యాంక్ అధికంగా ఉంది. దాంతో ట్రూడో సిక్కుల ఓట్లు ఎక్క‌డ పోతాయో అని వారికే మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. కెన‌డాకు చెందిన న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ (NDP) అధినేత జ‌గ్మీత్ సింగ్ కూడా ఓ ఖ‌లిస్తానీనే. ట్రూడోకి జ‌గ్మీత్ అంటే అమిత‌మైన గౌర‌వం. ఈ పార్టీపైనే ఎక్కువ‌గా ట్రూడో ఆధార‌ప‌డుతున్నాడు. ఇప్పుడు భార‌త్ దృష్టిలో కెన‌డా ఎంత నీచానికి దిగ‌జారిపోయిందంటే.. గ‌తంలో పాకిస్థాన్‌పై భార‌త్ చేసిన విమ‌ర్శ‌ల‌తో పోలిస్తే కెన‌డాపై మ‌రింత క‌ఠిన‌మైన ప‌దాల‌ను వాడాల్సి వ‌చ్చింది. సాధార‌ణంగా మ‌న భార‌తీయులు పాకిస్థానీయుల‌ను ఎలా తిట్టుకుంటారో తెలిసిందే. ఇంత‌కంటే దారుణంగా ఇప్పుడు కెన‌డాను తిట్టుకుంటున్నారంటే కెన‌డా దిగ‌జారుడుత‌నానికి అద్దంప‌డుతోంది.

కెన‌డాతో భార‌త్‌కు ఉన్న విభేదాలు కొత్తేం కాదు. 1980ల్లో ఎయిర్ ఇండియా విమానానికి ప్ర‌మాదం పొంచి ఉంది అని కెన‌డాను ముందే భార‌త్ హెచ్చ‌రించింది. అప్పుడు కెన‌డా ప‌ట్టించుకోలేదు. ఫ‌లితం.. బాంబు పేలుడులో 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం జ‌స్టిన్ ట్రూడో తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఏదో ఒక రోజు సొంత దేశానికి, ప్ర‌పంచానికి ప్ర‌మాదాన్ని కొనితెచ్చేలా ఉన్నాయి.