Covid: ఒక్కరోజే 12 వేలు దాటిన కేసులు.. 42 మంది మృతి!

Delhi: దేశంలో కరోనా వైరస్ (corona virus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ (central health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 42 మంది కొవిడ్‌తో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండటంలో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు గతవారం 5.5 శాతానికి పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

దేశంలో కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కమ్యూనిటీ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని కేంద్రం సూచిస్తోంది. ఇక మహమ్మారి నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ భూషణ్ రాష్ట్రాలకు సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.