Covid: కొత్తగా 3823 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని.. ఇది గతంలో పోలిస్తే 27 శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 16 వేల 354 కి పెరిగాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసులు గతంలో కంటే ఇవాళ్టితో పోలిస్తే 27% పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం కోవిడ్ కేసులు 3,095, శనివారం 2995, ఆదివారం ఒక్క రోజే 3,824 మందికి కరోనా వైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్‌ కేసులు వేగంగా విస్తరించడం కలకలం రేపుతోంది.

మాస్కులు తప్పనిసరి..
దేశంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలని చెబుతోంది. శానిటైజర్‌ వినియోగించాలని.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. అయితే మరోవైపు భారత్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌లను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో వైరస్‌ మరింత విస్తరించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.