వృద్ధులకు విజ్ఞప్తి… వచ్చే నెల పింఛను ఆలస్యం
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ జరుగుతోంది. అయితే వచ్చే నెలలో మాత్రం 3వ తేదీ వరకు వేచి చూడాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి గల కారణాలను వివరించింది. సాధారణంగా ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇస్తారు. కానీ ఏప్రిల్ 1న ఆర్‌బీఐ సెలవు, ఏప్రిల్ 2న ఆదివారం కావడంతో 3వ తేదీ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే ఒక్క రోజులో అన్ని పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి.. 4, 5 తేదీల్లో కూడా కొన్ని చోట్ల పంపిణీ చేసే అవకాశం ఉంది.