రష్మిక ఎవరు: శుభ్‌మన్ గిల్ కామెంట్
‘ఛలో’ అంటూ టాలీవుడ్లో అడుగుపెట్టి‘గీత గోవిందం’తో నేషనల్ క్రష్‌గా అందరి మనసులూ దోచేసిన హీరోయిన్ రష్మికా మందన్నా. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ కన్నడ భామ. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక నటనకి దేశవ్యాప్తంగా ఆదరణ దక్కింది. అంతేకాదు బాలకృష్ణ వంటి టాప్ హీరోలు కూడా తమ క్రష్ రష్మిక అంటూ కితాబిచ్చేశారు. అయితే తాజాగా భారత క్రికెటర్ శుభమన్ గిల్ రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు రష్మిక ఎవరో కూడా తనకు తెలియదంటూ ఇన్‌స్టా వేదికగా గిల్ వీడియో షేర్ చేయడంతో ఈ విషయంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మికా మందన్నా. అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఏకంగా స్థాయిలో సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న ఈ భామకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈమెకు సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిపోయారు.ఇలా నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి రష్మికా మందన్న తన క్రష్ అంటూ గతంలో ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ చేసిన ప్రస్తుతం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలు తాను చేయలేదంటూ తాజాగా ఈ వార్తలపై క్రికెటర్ గిల్ స్పందించారు.
ఈ సందర్భంగా గిల్ సోషల్ మీడియా వేదికగా రష్మిక తన క్రష్ అంటూ చెప్పినటువంటి విషయం గురించి మాట్లాడుతూ ‘అసలు నేను ఏ మీడియాకు చెప్పాను?’ అంటూ ప్రశ్నించారు. ‘నేను ఎవరితోనూ ఇలా చెప్పినట్టు నాకు గుర్తులేదు.తను ఎవరో కూడా నాకు తెలియదు’ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రముఖ క్రికెటర్ రష్మిక ఎవరో తనుకు తెలియదు అని చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక తెలియకపోవడం ఏంటి? అయినా నీకు రష్మిక ఎందుకు తెలుస్తుంది నీకు సారా టెండూల్కర్,సారా అలీ ఖాన్ వంటి వారు నీ క్రష్ అయినప్పుడు రష్మిక ఎందుకు అవుతుందిలే’అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వరుసగా ట్రోల్స్‌కి గురవుతున్న రష్మికా వాటిని ఎదుర్కొంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అతిగా మాట్లాడినవారికి సోషల్ మీడియా వేదికగా చురకలు కూడా అంటిస్తున్నారు. గిల్ వ్యాఖ్యలపై రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి మరి!