Hydraa: టార్గెట్ హుస్సేన్ సాగ‌ర్ జ‌ల విహార్

hydraa targets hussain sagar

Hydraa: తెలంగాణ‌లో అక్ర‌మ నిర్మాణాల‌ను వ‌రుసపెట్టి కూల్చేస్తున్న హైడ్రా (హైద‌రాబాద్ డిసాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిట‌రింగ్ అండ్ ప్రొటెక్ష‌న్) ఇప్పుడు హుస్సేన్ సాగ‌ర్‌ను టార్గెట్ చేసింది. గ‌ణేష్ ఉత్స‌వాల నేప‌థ్యంలో రెండు వారాలుగా హైడ్రా ఎలాంటి కూల్చివేత‌ల‌కు పాల్ప‌డ‌లేదు. ఇప్పుడు ఉత్స‌వాలు అయిపోయిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న్ రంగ‌నాథ్ మ‌ళ్లీ యాక్ష‌న్‌లోకి దిగారు. హుస్సేన్ సాగ‌ర్ చుట్టు ప‌క్క‌ల ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో క‌ట్టిన నిర్మాణాల‌ను కూల్చివేసేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగా టార్గెట్ చేసేది జ‌ల‌విహార్, థ్రిల్ సిటీ.  ఈ రెండు క‌ట్ట‌డాల‌ను చెరువును ఆక్ర‌మించే చేసార‌న్న ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. అదీకాకుండా జ‌ల‌విహార్, థ్రిల్ సిటీకి వ‌చ్చే పర్యాట‌కులు చెత్త మొత్తం హుస్సేన్ సాగ‌ర్‌లోనే వేస్తున్నార‌ని ఫిర్యాదులు చేసారు.

CPI జాతీయ లీడ‌ర్, మాజీ ఎంపీ అజీజ్ పాషా ఈ మేర‌కు హైడ్రాకు ఫిర్యాదును అంద‌జేసారు. హుస్సేన్ సాగ‌ర్ బ‌ఫ‌ర్ జోన్‌లో 12.5 ఎక‌రాల్లో ఈ జ‌ల‌విహార్‌ను నిర్మించార‌ని.. దీనిని ఎంత త్వ‌ర‌గా కూల్చేస్తే అంత త్వ‌ర‌గా హుస్సేన్ సాగ‌ర్ మురికి, చెత్త నుంచి కోలుకుంటుంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేర‌కు రంగ‌నాథ్ ప‌రిశీల‌న‌లు చేప‌డుతున్నారు. 2007లో ఈ జ‌ల‌విహార్‌ను నిర్మించారు. అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ భూమిని 30 ఏళ్ల పాటు లీజ్‌కి తీసుకుని దీనిని నిర్మించింది.