RRR నటుడు కన్నుమూత..రాజ‌మౌళి సంతాపం

Italy: ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్(Ray Stevenson) మరణించారు. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన RRR సినిమాతో తెలుగువారికి దగ్గరైన స్టీవెన్​సన్​ అనారోగ్య సమస్యలతో మే 22 రాత్రి ఇటలీలో మరణించారు. రామ్​ చరణ్(Ram Charan)​, ఎన్టీఆర్(Jr NTR)​ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో కీలకపాత్రలో కనిపించి మెప్పించారు.

RRR సినిమాలో బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ పాత్రలో నటించి మెప్పించారు. క్లైమాక్స్ ఫైటింగ్ సీన్స్ లో మరింత మెప్పించారు రే స్టీవెన్ సన్. RRR సినిమాతో ఇండియాలోనే కాక ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. రే స్టీవెన్ సన్ పలు బ్రిటన్, హాలీవుడ్ సినిమాలలో నటించారు. థోర్, ట్రాన్స్‌పోర్టర్ సినిమాలతో రే స్టీవెన్ సన్ బాగా పాపులర్ అయ్యారు. ఆయన చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రే స్టీవెన్ సన్ మరణంతో RRR చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. పలువురు హాలీవుడ్, బ్రిటన్ ప్రముఖులు రే స్టీవెన్ సన్ కు నివాళులు అర్పిస్తున్నారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రే స్టీవెన్‌స‌న్‌కు సీన్ వివ‌రిస్తున్న ఫొటో పోస్ట్ చేసి సంతాపం తెలిపారు.