మాకు ప‌ఠాన్‌.. మీకు ద‌స‌రా: ముంబైలో నాని హంగామా

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్​ ఓదెల ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్​గా నటిస్తోంది. మాస్ మసాలా ఎంటర్టైనర్​గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు నాని మాస్​లుక్స్​కి ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. మేకర్స్ మాస్ అప్పీలింగ్ పోస్టర్‌ తో పాటు గ్లింప్స్ వీడియోని ఇటీవలే విడుదల చేశారు. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని కళ్ళజోడు ధరించి బీడీ తాగుతూ ఊర మాస్‌గా ఆకట్టుకున్నారు. ధరణిని ఘనంగా స్వాగతిస్తున్న డప్పు దరువులు కూడా పోస్టర్‌లో అలరిస్తున్నాయి. నాని హీరోగా వస్తున్న తొలి పాన్​ఇండియా మూవీ అవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుండటంతో హిందీ మార్కెట్ వసూళ్లు ఆసక్తిగా మారాయి. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుండగా, ఇప్పటికే మూవీ టీమ్​ ప్రమోషన్స్​ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా నాని ముంబై వెళ్లి హోళీ వేడుకల్లో పాల్గొనట్లు తెలుస్తోంది.

 

అయితే నాని హిందీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లగా అక్కడి అభిమానుల నుంచి గ్రాండ్​ వెల్​కమ్​ లభించింది. అంతేకాదు అక్కడ యూత్​తో కలిసి హోళీ వేడుకల్లో నాని చేసిన హంగామా నెట్టింట వైరలవుతోంది. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో ని కూడా నాని షేర్ చేయగా వైరల్ అయింది. మొత్తానికి అయితే హిందీ ఆడియెన్స్ నుంచి కూడా దసరా కి మంచి ఓపెనింగ్స్ దక్కేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్​లోనూ భారీ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. ఈ సందర్భంగా ప్రతి సినిమానీ పాన్​ ఇండియా రేంజ్​లో ప్లాన్​ చేస్తున్నారు టాలీవుడ్​ దర్శకనిర్మాతలు. ఈ సంద‌ర్భంగా నాని అక్క‌డి ప్రేక్షకుల‌తో మాట్లాడుతూ.. “మాకు ప‌ఠాన్ ఉంటే..మీకు ద‌స‌రా ఉంటుంది. ఇక సౌత్, నార్త్ అనేవి లేవు. మ‌న‌కున్న‌ది ఒక‌టే ఇండ‌స్ట్రీ. అదే ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ. ఈ నెల 30న ద‌స‌రా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మాస్‌, కంటెంట్ క‌లిగిన ప‌ర్‌ఫెక్స్ మిక్స్” అని తెలిపారు.

 

కాగా, ‘దసరా’ సినిమాలో నాని పేరు ధరణి. ఇది నల్ల బొగ్గు నేపథ్యంలో సాగే సినిమా. తెలంగాణలోని గోదావరిఖని దగ్గర ఒక గ్రామం లో జరిగే కథ. ఈ సినిమాలో నాని మోటుగా కనిపిస్తాడు, అలాగే అతని లుక్ కూడా ఒక చదువులేని వాడిలా వుండే విధంగా విడుదల అయిన టీజర్ లో చూపించారు. ఈ సినిమా మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. అందుకనే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చెయ్యాలని ముంబై లో హోళీ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. టక్​ జగదీష్​, అంటే.. సుందరానికి సినిమాల ఫలితం ఆశించినట్లు రాకపోవడంతో దసరా సినిమాపై నాని ఎక్కువగా ఫోకస్​ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే మార్చ్ 30 వరకు ఆగాల్సిందే.