తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు!
Hyderabad: తెలంగాణ(Telangana)లో రానున్న మూడు రోజులపాటు ఎండలు దంచికొట్టనున్నాయి. మే 15, 16, 17వ తేదీల్లో అధిక ఉష్ణోగ్రతలు(High temperatures) నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 42°C నుండి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలో 40°C నుండి 42°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతతోపాటు వడగాల్పులు భారీగా వీయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఆయా ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండల అధికారులకు ఉన్నతాధికారులు సూచనలు జారీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.