Hema: హేమ‌ రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు నిర్ధార‌ణ‌

hema took drugs says banglore narcotics bureau

 

Hema: బెంగ‌ళూరు రేవ్ పార్టీలో న‌టి హేమ పాల్గొన‌డ‌మే కాకుండా డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ అయ్యింది. ఈ పార్టీలో దాదాపు 200 మంది పాల్గొన‌గా.. వారిలో అనుమానంగా ఉన్న 100 మందిపై వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ వంద మందిలో మొత్తం 86 మంది డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. డ్ర‌గ్స్ తీసుకున్న‌వారిలో హేమ కూడా ఉన్న‌ట్లు వెల్ల‌డించ‌డంతో టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హేమ‌ను మా అసోసియేష‌న్ నుంచి తొల‌గించాలంటూ న‌టి క‌రాటే క‌ళ్యాణి డిమాండ్ చేస్తున్నారు.