snowfall at Kedarnath: మంచు తుఫాను.. ఊపిరాడక యాత్రికుల‌ అవస్థలు!

Hyderabad: ఉత్తరాఖాండ్‌లోని కేదార్ నాథ్(kedarnath) లో మంచు తుపాన్‌(heavy snow fall) భీభత్సం సృష్టిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యాత్రికులను గుర్రాలపై తీసుకెళుతున్నారు. మంచు వర్షంలా కురుస్తుండంటం వల్ల కొందరు యాత్రికులు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని సమాచారం.

ఇవాళ ఉదయం యాత్రికులపై ఓ మంచు కొండ విరిగిపడటం కలకలం రేపుతోంది. దీంతో అనేక మంది మంచులో కూరుకుపోయారు. వెంటనే స్పందించన తోటి యాత్రికులు, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి.. వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మంచులో కూరుకుపోయిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నట్లు సమాచారం. దాదాపు 150 మంది తెలుగు వారు మంచులో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఒకవైపు కుండపోతగా మంచు వర్షం కురుస్తోంది. మంచు చరియలు విరిగి పడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.