Health: గుండె పనితీరుని జుట్టు చెప్పేస్తుంది!
Hyderabad: గుండె పనితీరు(Heart Fuction)ని చాలా రకాలుగా కనిపెట్టవచ్చు. తాజా పరిశోధనల ప్రకారం జుట్టు(Hair)ని బట్టి కూడా గుండె పనితీరును, భవిష్యత్తులో గుండె సంబంధ వ్యాధులు కలిగే అవకాశాలను అంచనా వేయవచ్చంటున్నారు నిఫుణులు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన ఈ సంవత్సరం యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ (ECO)లో సమర్పించిన అధ్యయన నివేదిక ప్రకారం, గ్లూకోకార్టికాయిడ్ స్థాయిలు – ఒత్తిడికి ప్రతిస్పందనగా స్రవించే స్టెరాయిడ్ హార్మోన్ల స్థాయిల్ని బట్టి భవిష్యత్తులో CVDతో బాధపడవలసి ఉంటుందనేది చెప్పవచ్చంటున్నారు పరిశోధకులు.
దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం ఎక్కువ కాలం జుట్టు గ్లూకోకార్టికాయిడ్ స్థాయిలు ఉన్నవారు ముఖ్యంగా గుండె మరియు రక్త ప్రసరణ వ్యాధులను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది. నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ రోటర్‌డ్యామ్‌కు చెందిన పరిశోధకుల బృందం వయోజన పురుషులు మరియు మహిళలు నుండి 6,341 జుట్టు నమూనాలలో కార్టిసాల్ మరియు కార్టిసోన్ స్థాయిలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. 5 నుంచి 7 సంవత్సరాల పాటు వారిని పరిశీలించగా దీర్ఘకాలిక కార్టిసోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలింది. ఇది 57 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో మూడు రెట్లు పెరిగింది.