Drinks: నీరసమా.. ఈ డ్రింక్స్​ ట్రై చేయండి!

Hyderabad: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం(Health)గా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పనిఒత్తిడి(Work pressure), ఆందోళన కారణంగా కొన్నిసార్లు నీరసంగా అనిపిస్తుంది. మహిళ(Women)ల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అమెరికన్​ సైకలాజికల్​ అసోసియేషన్​ ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు అలసటకు గురవుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు శరీరానికి శక్తి(Energy)తోపాటు మనసుకూ కాస్త ఆహ్లాదాన్నిచ్చే పానీయాల్ని(Drinks) తీసుకోవడం మంచిది. అప్పటికప్పడు శక్తినిచ్చే డ్రింక్స్(Boosting drinks)​ ఏంటో చూద్దాం..

నీళ్లు(Water)

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పానీయాల్లో మొదటిది నీళ్లు. నిర్జలీకరణం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. డీహైడ్రేషన్​ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల మానసిక సమస్యలూ కలుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

కాఫీ(Coffee)

కాఫీలో ఉండే కెఫీన్​ నిద్రకు ప్రేరేపించే అడెనోసిన్​ను నియంత్రించి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కెఫీన్​ మెదడు, గుండె పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. అయితే శరీరంలో కెఫీన్​ స్థాయిలు పెరిగితే ఆరోగ్యానికి ప్రమాదం.

స్మూతీలు(Smoothies)

తాజా పండ్లు, పాలు, చక్కెర, సబ్జీ వంటి పదార్థాలతో తయారుచేసే స్మూతీలు తక్షణ శక్తిని అందిస్తాయి. కాఫీ, టీ వంటి వాటికంటే స్మూతీలు తీసుకోవడం ఆరోగ్యకరం. వీటిలో శరీరానికి శక్తినందించే మాక్రోన్యూట్రియెంట్లు-కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి.

మాచ టీ(Matcha Tea)

ఒత్తిడి తగ్గించడంలో మాచ టీ చక్కగా పనిచేస్తుంది. దీనిలోని థియనైన్ చురుకుదనాన్ని కలిగిస్తుంది. టీ, కాఫీలకంటే ఈ టీని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

పండ్ల రసాలు(Fresh Fruit and Veggie Juice)

తాజా పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూసుల్లో తక్షణ శక్తిని అందించే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కీరా, తర్భూజా, కొబ్బరి, కివి వంటి వాటితో చేసిన డ్రింక్స్​ మెదడు కణాల పనితీరును మెరుగు పరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్​రూట్​, క్యారెట్​ వంటి వాటితో చేసిన రసాలు మంచి ఫలితం అందిస్తాయి. వీటితోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.