పవన్ మూవీలో విలన్‌గా యాక్ట్ చేయాలన్నారు: మల్లారెడ్డి
BRS నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనను విలన్‌గా నటించాలని గంట సేపు రిక్వెస్ట్ చేసాడట. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదట. మేం ఫేమస్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు మల్లారెడ్డి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
“ఈరోజు మేం ఫేమస్. మీరు కాదు మేం ఫేమస్. హీరో పేరు సుమంత్ ప్రభాస్. చెప్పాలంటే ఇతను ప్రభాస్ కంటే స్మార్ట్ ఉన్నాడు. నిజంగా చెప్తున్నా. ప్రభాస్ అంటే చాలా మేకప్ వేసుకుంటాడు. కానీ ఈ హీరో మేకప్ లేకుండానే చాలా స్మార్ట్ ఉన్నాడు. ఈయన తెలంగాణ మోడల్, తెలంగాణ బిడ్డ. ఈ హీరో నాన్న పేరు కూడా మల్లా రెడ్డి. అందుకే వచ్చినా ఈవెంట్‌కి. తెలంగాణ యూత్ నుంచి మరిన్ని సినిమాలు రావాలి. ఈ సినిమా హిట్ అయితే ఈ అబ్బాయితోనే రెండో సినిమాను నేనే తీస్తా. యువత ప్రేమ, డేటింగ్, పార్టీలు అని టైం వేస్ట్ చేసుకోకండి. యవ్వనం పోతే మళ్లీ రాదు ఎంజాయ్ చేయలేం అంటుంటారు. అదేం కాదు. ఈ వయసులోనే మీరు మీ జీవితానికి కావాల్సినంత సంపాదించుకునే ఓపిక ఉంటుంది. నాకు 23 ఏళ్లకే పెళ్లి చేసారు. అప్పట్లో నా జీవితం ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు. ఇప్పుడు మల్లా రెడ్డి అంటేనే తెలంగాణ మోడల్. ఎందుకంటే నేను లో ప్రొఫైల్ హై విజన్ మనిషిని. నా కాలేజీల్లో 60,000 మంది తెలంగాణ యువత ఉన్నారు. తెలంగాణ యువత ఇప్పుడు కష్టపడితే.. మన రాష్ట్రాన్ని పై స్థాయిలో ఉంచుతారు. మీరు ఈ వయసులో యూత్ అంటున్నారు. నిజానికి అసలైన యూత్ అంటే 70 ఏళ్లు ఉన్న నేను. ఇప్పటికీ నేను మీ కంటే ఫిట్‌గా ఉన్నా అని గర్వంగా చెప్పుకుంటా. గబ్బర్ సింగ్ తీస్తున్న సమయంలో నన్ను విలన్‌గా యాక్ట్ చేయమని దర్శకుడు హరీష్ శంకర్ మా ఇంటికి వచ్చి దాదాపు గంటన్నర పాటు రిక్వెస్ట్ చేసాడు. కానీ నేను నో అన్నా. మేం ఫేమస్ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నా. వచ్చే ఏడాది ఎన్నికలు అయ్యాక నాలుగు సినిమాలు తీయాలనుకుంటున్నా” అని తెలిపారు మల్లారెడ్డి.