Hardik Pandya: రోహిత్‌ను టీం నుంచే తొల‌గించేయ‌మ‌న్న హార్దిక్

Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య గురించి మ‌రో షాకింగ్ విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్.. ముంబై ఇండియ‌న్స్ నుంచి పిలుపు వ‌స్తే కెప్టెన్సీ ఇస్తే కానీ రాన‌ని చెప్పిన‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దాంతో రోహిత్ శ‌ర్మ‌ను (Rohit Sharma) కాద‌ని కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను హార్దిక్‌కు కేటాయించారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు హార్దిక్ పాండ్య ఈసారి IPL మ్యాచ్‌ల‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా గెల‌వ‌లేక‌పోయాడు.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. కెప్టెన్ అయ్యాక రోహిత్ శ‌ర్మ‌ను ముంబై ఇండియ‌న్స్ టీం నుంచి తొల‌గించేసి వేరే టీంలో వేయాల‌ని హార్దిక్ కోరాడ‌ట‌. ఇందుకోసం డేవిడ్ వార్న‌ర్‌తో డీల్ కుదుర్చుకుని రోహిత్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు పంపించాల‌ని అనుకున్నట్లు క్రికెట్ వ‌ర్గాల్లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. అస‌లే రోహిత్‌ను కెప్టెన్‌గా తీసేసి హార్దిక్‌కు ఇవ్వ‌డంతో అత‌ను రోహిత్ అభిమానుల నుంచి ఎన్నో అవ‌మానాలు, ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఇక రోహిత్‌ను అస‌లు టీంలోనే లేకుండా చేసేందుకు హార్దిక్ కుట్ర‌లు ప‌న్నాడ‌ని తెలిస్తే ఏం జ‌రుగుతుందో ఏమో..! పైకి మామూలుగా రోహిత్‌తో ఫ్రెండ్లీగా కనిపిస్తూనే హార్దిక్ వెన్నుపోటు పొడుస్తున్నాడ‌న్న‌మాట‌…!