ముందు నాన్న రేప్ చేసాడు.. ఆ తర్వాత నేను.. ఇజ్రాయెల్ మహిళపై హమాస్ అమానుషం
Israel: ఇజ్రాయెల్ హమాస్‌పై చేస్తున్న యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇజ్రాయెల్‌కి చెందిన మహిళా సైనికులపై హమాస్ దారుణంగా ప్రవర్తిస్తోంది. వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో హమాస్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఓ మహిళను ఎంత దారుణంగా అత్యాచారం చేసారో మీడియాకు వెల్లడించారు.
గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు దాడి చేసారు. ఆ సమయంలో 47 ఏళ్ల జమాల్ హుస్సేన్, అతని కొడుకు అబ్దుల్లా కూడా హమాస్ కోసం పనిచేస్తున్నారు. అక్టబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్న సమయంలో ఓ మహిళ అరుపులు వినిపించాయని ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లామని అన్నారు. ఆ తర్వాత తన తండ్రి ఆమెను రేప్ చేయగా.. ఆ తర్వాత గన్నుతో బెదిరించి తాను కూడా రేప్ చేసానని అబ్దుల్లా తెలిపాడు. ఆ తర్వాత ఆ మహిళను తన తండ్రి తుపాకీతో కాల్చి చంపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తండ్రీ కొడుకులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అదుపులో విచారణ ఎదుర్కొంటున్నారు.