ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తరగతులు నిర్వహించనున్నారు. ఇక 2022-23 అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24 అని నిర్ణయించారు. అంటే ఏప్రిల్‌ 25 నుంచి సమ్మర్‌ హాలిడేస్‌ ఉంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుందన్నారు. అయితే, పదో తరగతి విద్యార్థుల విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇస్తున్నారు. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో మేరకు… వారికి స్పెషల్ క్లాసులు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక మిగిలిన తరగతులు విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలిడేస్ కొనసాగనున్నాయి. అయితే.. ఏప్రిల్ 10 నుంచి 17 వరకూ ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉంటాయని స్కూల్‌ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది మండిపోనున్న ఎండలు…
ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనూహ్యంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండ వేడిమిని తట్టుకునేలా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ముందస్తు అప్రమత్తత అవసరమని సూచిస్తోంది. ప్రజలు అనారోగ్యానికి గురికాకముందే తగు జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కేంద్రం పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో అప్రమత్తత అవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకూడదని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొలమానాలను. వేసవిలో ఎండ వేడిమికి రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయాలని లేఖలో పేర్కొన్నారు. వేసవిలో ఎక్కువ నీరు తాగడంతోపాటు, ప్రజలు చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.