గులాబ్ తుఫాన్.. గుబులు రేపుతోంది: IMD వార్నింగ్‌!

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌కు 65 కి. మీ, తెలంగాణలోని భద్రాచలానికి 120 కి. మీ దూరంలో గులాబ్ తుఫాన్ కేంద్రీకృతం అయి ఉందని.. భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది. రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. మరో కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృస్టించనున్నట్లు ఐఎండీ చెబుతోంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తర, కోస్తాంధ్రలోని పలు జిల్లాలలో పాటు, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌, వికారాబాద్‌, జహీరాబాద్‌ తదితర జిల్లాల్లో నిన్న మధ్యాహ్న నుంచి భారీ వర్షలు, వడగండ్ల వాన కురిసింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏపీలో పలు జిల్లాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. ఇక మరోవైపు రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఈ జిల్లాలపై ప్రభావం..
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ఇక, ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.