ప‌వ‌న్‌కు 2 పాసులు ఇస్తాం: గుడివాడ అమ‌ర్నాథ్ ఎగ‌తాళి

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌పై ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కామెంట్స్ చేసారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఈసారి ఓడిపోబోమ‌ని క‌చ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తీర‌తామ‌ని అన్నారు. ఈనేప‌థ్యంలో అమ‌ర్నాథ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు అసెంబ్లీకి రావాలని కోరికగా ఉన్నట్టుంది. దానికి ఎన్నికల వరకు ఎందుకు? కావాలంటే స్పీకర్‌ని అడిగి రెండు పాసులు ఇస్తాం చూసి వెళ్లొచ్చు. జెండా పవన్‌ కళ్యాణ్ ది.. అజెండా టీడీపీది. డబ్బులు లేవు అంటాడు, రోజుకు రెండు కోట్లు సంపాదిస్తున్నాడు. జనసేనాకు పదేళ్లుగా అజెండా లేదు.. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. అది కాపు జ‌న‌సేన కాదు. క‌మ్మ జ‌నసేన‌. కాపులంద‌రినీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టాల‌ని చూస్తున్నాడు. పోనీ 175 సీట్లకి 175 పోటీ చేస్తారా అంటే అది కూడా చెప్పే ధైర్యం లేదు. అని కామెంట్లు చేసారు.