Dotted Lands సమస్యకు సీఎం జగన్ చెక్
kavali: చుక్కల భూముల(dotted lands) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేలా సీఎం జగన్(cm jagan) రైతన్నలకు పట్టాలు పంపిణీ చేశారు. దశాబ్దాల సమస్యకు చెక్ పెడుతూ.. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుంచి తొలగించే విధంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి.
ఎన్నికల కోసమే ప్రతిపక్షాల్లో రైతులపై ప్రేమ
రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడని జగన్ మండిపడ్డారు. దానిపై దత్తపుత్రుడు, పచ్చ మీడియా ఒక్కమాట కుడా అనలేదని విమర్శించారు. ప్రశ్నిస్తా అని చెప్పిన పెద్ద మనిషి ప్రశ్నించటమే మానేశారని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఒకవైపు, బాబు స్క్రిప్టులను డైలాగులుగా చెబుతున్న ప్యాకెజీ స్టార్ ఒక వైపు, వీరి డ్రామాను రక్తికట్టించేందుకు పచ్చ మీడియా ఒక వైపు ఉండి డ్రామాలు చేస్తున్నారని రైతన్నలు, వీళ్ల డ్రామాలను నమ్మవద్దని జగన్ కోరారు. డీబీటీ ద్వారా రూ 2.10 లక్షల కోట్లు నేరుగా జమ చేశామని, ఇది మానవ వనరులపై పెట్టుబడి అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డ్రైవర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడి ఉద్యోగం సంపాదించే రోజు వస్తుంది. లంచాలు, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.