కోహ్లీ ఆక‌లిపై న‌మ్మ‌కం ఉంది.. వెన‌కేసుకొచ్చిన గౌతూ

gautam gambhir supports virat kohli

Gautam Gambhir: 2023 డిసెంబ‌ర్ నుంచి టెస్ట్ క్రికెట్‌లో కింగ్ విరాట్ కోహ్లీ పెద్ద‌గా స్కోర్ చేయ‌లేక‌పోతున్నాడు. దాంతో నవంబ‌ర్‌లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జ‌ర‌గ‌బోయే బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఎలా ఆడ‌తాడో అనే సందేహాలు, అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ విష‌యంపై టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ స్పందించారు. కోహ్లీ విష‌యంలో త‌న‌కు ఎలాంటి సందేహాలు లేవ‌ని.. కోహ్లీ వ‌ర‌ల్డ్ క్లాస్ క్రికెట‌ర్ అని అన్నారు. ఇంకా బాగా ఆడాలి అన్న ఆక‌లి కోహ్లీలో ఇంకా చావ‌లేద‌ని.. ఆ ఒక్క ఫ్యాక్ట‌రే కోహ్లీని బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇంకా బాగా ఆడేలా చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని అన్నారు.

ఏదో ఒక‌టి రెండు మ్యాచ్‌ల‌లో స‌రిగ్గా ఆడ‌నంత మాత్రాన మొత్తం పెర్ఫామెన్స్ గురించి మార్కులు వేయ‌లేమ‌ని తెలిపారు. ఒక ఆటగాడు రెండు మూడు మ్యాచ్‌ల‌లో స‌రిగ్గా ఆడ‌నంత మాత్రాన వారిని త‌ప్పించే టైపు తాను కాద‌ని.. మొత్తం టీమిండియా బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీలో ఇర‌గ‌దీసేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.