Gautam Adani Deal: బిక్కు బిక్కుమంటున్న‌ అదానీ డీల్ లీక్ చేసిన వ్య‌క్తి

gautam adani whistleblower Nelson Amenya is living in fear

Gautam Adani Deal: ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ వ్యాపారాల‌కు సంబంధించిన విష‌యంలో ఓ వ్య‌క్తి క‌ల‌గజేసుకున్నాడు. అదానీ డీల్‌కి సంబంధించిన సీక్రెట్‌ను లీక్ చేసాడు. దాంతో అదానీకి వేల కోట్లు న‌ష్టం వాటిల్లింది. ఇప్పుడు డీల్ విష‌యాలు లీక్ చేసిన వ్య‌క్తి బిక్కుబిక్కు మంటూ బ‌తుకుతున్నాడు.

కెన్యాలోని అతిపెద్ద అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం అయిన జోమో కెన్యాటా ఎయిర్‌పోర్ట్‌ను లీజ్‌కి తీసుకోవాల‌ని అదానీ నిర్ణ‌యించారు. జోమో కెన్యాట్టా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంతో అదానీ కంట్రాక్ట్ పుచ్చుకుంది. ఇది ఏవియేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు ఏమాత్రం నచ్చ‌లేదు. అదానీ భార‌తీయుడ‌ని.. అలాంటి వ్య‌క్తికి ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తార‌ని ఆందోళ‌న చేప‌ట్టారు. దాంతో వేలాది ప్ర‌యాణికులు ఎయిర్‌పోర్ట్‌కి రాలేని విమానం ఎక్క‌లేని ప‌రిస్థితి ఏర్పడింది.

ఈ నేప‌థ్యంలో ఎయిర్‌పోర్ట్‌తో అదానీ ఓ సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారు అంటూ నెల్స‌న్ అమెన్యా అనే వ్య‌క్తి ఈ విష‌యాన్ని బ‌య‌టికి లీక్ చేసాడు. ప్ర‌స్తుతం ఫ్రాన్స్‌లో ఉంటూ చ‌దువుకుంటున్న నెల్స‌న్ అదానీ డీల్ గురించి బ‌య‌ట‌పెట్ట‌డంతో త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నాడు. డీల్ ప్ర‌కారం అదానీ ఆ ఎయిర్‌పోర్ట్‌ను 30 ఏళ్లకు లీజ్‌కి తీసుకుని లీజ్ గ‌డువు ముగిసాక 18% ఈక్విటీని ద‌క్కించుకోవాల‌ని అనుకున్నారు. ఇత‌ర బిడ్డ‌ర్ల‌ను కూడా పిల‌వ‌కుండా ఎయిర్‌పోర్ట్ అధికారుల‌తో ఈ డీల్‌ను అదానీ అత్యంత ర‌హ‌స్యంగా కుదుర్చుకున్నారు.

ఈ డీల్‌కి సంబంధించిన అగ్రిమెంట్‌పై సంత‌కాలు చేయ‌డానికి ముందే నెల్స‌న్ డీల్ విష‌యాల‌ను మ‌డియాకు టిప్ ఇచ్చి లీక్ చేసాడు. ఆ త‌ర్వాత కెన్యాకు చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ క్రిమిన‌ల్ ఇన్వెస్టిగేష‌న్స్ డిపార్ట్‌మెంట్ నెల్సన్‌కు కార్బ‌న్ అనే కంపెనీ ఉందని ఈ కంపెనీ ద్వారా ఫేక్ క్రిప్టో క‌రెన్సీలు అమ్ముతున్నాడ‌ని ఆరోపించింది. దీనిలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని నెల్స‌న్ వెల్ల‌డించాడు.

అదానీ డీల్ బ‌య‌ట‌ప‌డ‌టంతో ఈ కాంట్రాక్ట్ త‌మ‌కు ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని.. ఈ నిర్ణ‌యాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోక‌పోతే ఉద్యోగాలు పోయే అవ‌కాశం ఉంద‌ని ఏవియేష‌న్ వ‌ర్క‌ర్లు హెచ్చ‌రించారు. దీనిపై ఎయిర్‌పోర్ట్ అధికారులు కెన్యా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. వ‌ర్క‌ర్ల అనుమ‌తి లేనిదే ఈ డీల్‌ను ముందుకు తీసుకెళ్ల‌మ‌ని వారు హామీ ఇచ్చారు.

Gautam Adani Deal: అసలు అదానీతో డీలే వ‌ద్దు అంటుంటే మ‌ళ్లీ అనుమ‌తి అంటారేంటి అంటూ ఏవియేష‌న్ వర్క‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఈ ఎయిర్‌పోర్ట్ ఉన్న సామ‌ర్ధ్యం కంటే ఎక్కువ‌గా ఆపరేష‌న్స్ చేప‌డుతోంద‌ని.. దీనిని మెయింటైన్ చేయ‌డం కేవ‌లం ప్ర‌భుత్వం వ‌ల్ల కాద‌ని అదానీకి లీజ్‌కి ఇచ్చారు. కెన్యాలో జాతీయ హోదా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను ప్రైవేట్ కంపెనీకి ఇవ్వ‌డం ఏవియేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు న‌చ్చ‌లేదు. దీనిపై వారు స్థానిక హైకోర్టును ఆశ్ర‌యించారు. కేసుకు సంబంధించి ప్ర‌తీ అంశం ప‌రిశీలించిన అనంత‌రం అదానీ ఈ డీల్‌కి దూరంగా ఉంటే మంచిద‌ని తీర్పు ఇచ్చింది.

ఈ ఎయిర్‌పోర్ట్ లీజ్ కోసం అదానీ 1.85 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చించింది. హైకోర్టు తీర్పుతో అదానీకి చుక్కెదురైంది. సరే అని శ్రీలంక‌లో (srilanka) పెట్టుబ‌డులు పెడ‌దామ‌ని అదానీ ప్లాన్ వేసుకున్నారు. శ్రీలంక‌లో అదానీకి విండ్ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ఉంది. రాబోయే శ్రీలంక అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో JVP అనే మార్క్‌సిస్ట్ పార్టీ (marxist party) గెలిస్తే ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తూ ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ విలువ 440 మిలియ‌న్ డాల‌ర్లు. ఈ ప్రాజెక్ట్ వ‌ల్ల వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయ‌ని అది మంచిది కాద‌ని ఇప్ప‌టికే ఎన్నో పిటిష‌న్లు కూడా వేసారు. ఇలా అంత‌ర్జాతీయంగా అదానీకి ఏదీ క‌లిసి రావ‌డం లేదు. కానీ భార‌త‌దేశంలో మాత్రం అదానీని కొట్టేవాడు లేడ‌ని మ‌రోసారి రుజువైంది. ఆయ‌న ఏ కాంట్రాక్ట్ పొందాల‌నుకుంటున్నా అవి వెంట‌నే ఓకే అయిపోతున్నాయి. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ప‌వ‌ర్ సప్లై కాంట్రాక్ట్ అదానీకే ద‌క్కింది. దీని వ‌ల్ల అదానీ స్టాక్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి.