Game Changer: సెకండ్​ లుక్​ వ‌చ్చేస్తోంది!

Hyderabad: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్'(Game Changer) ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియోకు అనూహ్య స్పందన లభిస్తోంది. కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తండ్రీకొడుకుల పాత్రల్లో అలరించనున్నారు.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్​లుక్​ కొడుకు పాత్రది. కాగా, తండ్రి పాత్రకు సంబంధించిన లుక్​ని త్వరలోనే విడుదల చేయనున్నారట.

రామ్ చరణ్ రెండవ గెటప్ కి సంబంధించిన లుక్ ని మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ సెకండ్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులో రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకున్నాడు. అయితే త్వరలో విడుదల చేయబోయే సెకండ్ లుక్ ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందట. ఇక లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ అని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో గేమ్ చేంజర్ మూవీలో సెకండ్ లుక్ ని విడుదల చేసేందుకు మేకర్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ త్వరలోనే రానుందని సమాచారం.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan) సరసన కియార అద్వానీ(Kiara Advani), అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.