సీఎం కేసీఆర్‌పై గద్దర్ పోటీ.. ఆ పార్టీ నుంచి బరిలో!
hyderabad: తెలంగాణ ఎన్నికల్లో(telangana elections) ఈ సారి అనేక కొత్త పార్టీల రంగంలోకి దిగుతున్నాయి. దీంతో కొత్త వ్యక్తులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila), బీఎస్‌పీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్(Rs praveen kumar), తీన్మార్ మల్లన్న(teenmar mallanna) వంటి వారు ఈ సారి ఎన్నికల్లో సొంత పార్టీలపై పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక తాజాగా.. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్(Gaddar) కూడా రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని(contest in elections) ప్రకటించారు. అంతే కాదు.. తాను పోటీ చేసేది సీఎం కేసీఆర్‌పై అని చెప్పడం మరో విశేషం. కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో పోటీకి సిద్దమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్(cm kcr)పై పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్(congress) ఆయనకు సీటు ఇవ్వలేదు. ఇక తాజాగా.. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న షర్మిలకు మద్దతుగా గద్దర్ ఇటీవల మాట్లాడారు. షర్మిల కేసీఆర్ కుటుంబ పాలనపై రాజీలేని పోరాటం సాగిస్తున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో ఆయన షర్మిల పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది.
గద్దర్ ఇవాళ మెదక్ జిల్లా(medak district) తూప్రాన్ పోలీసులను ఆశ్రయించారు.. తనకు పోలీసుల రక్షణ కావాలని కోరారు. ఇకపై తాను పుట్టిపెరిగిన ఊరిలోనే ఉంటానని పేర్కొన్నారు. అంబేద్కర్ స్పూర్తితోనే కేసీఆర్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దళితులకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. అంబేద్కర్ కల్పించిన ఓటుహక్కు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకుని సుపరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని గద్దర్ సూచించారు. ఏడు పదుల వయసున్న గద్దర్ అనేక ప్రజా ఉద్యమాలు చేసి.. తెలంగాణలో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాల్సి ఉంది.