పార్టీ లేదా బావా..వ‌స్తున్నా బావా…!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బావా బావా అనుకుంటూ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకోవ‌డం.. సినిమాల విష‌యంలోనే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ ఒక‌రికొక‌రు స‌పోర్ట్‌గా నిల‌వ‌డం.. ఇలా వీరి బాండింగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కాగా.. నిన్న అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఎన్టీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా విష్ చేసాడు. హ్యాపీ బ‌ర్త్‌డే బావా.. అని తార‌క్ విష్ చేయ‌గా.. థ్యాంక్యూ బావా.. వార్మ్ హ‌గ్స్‌.. అని బ‌న్నీ రిప్లై ఇచ్చారు. అంతటితో తారక్ ఆగ‌లేదు.. పుష్ప సినిమాలోని డైలాగ్‌తో హ‌గ్స్ ఒక్క‌టేనా.. పార్టీ లేదా పుష్పా అని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. ఇందుకు బ‌న్నీ కూడా.. వ‌స్తున్నా అని స‌మాధాన‌మిచ్చాడు. అలా వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ ఫ్యాన్స్ కూడా ఆనంద‌ప‌డిపోతున్నారు.

ఇక‌పోతే ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెట్స్‌లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ త‌న సైడ్ నుంచి అప్డేట్ ఇచ్చారు. మ‌రోప‌క్క బ‌న్నీ కూడా పుష్ప 2తో మాంచి కిక్ ఎక్కించే గ్లింప్స్ ఒక‌టి త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా షేర్ చేసారు. పుష్ప 2.. పుష్పను మించి ఉండ‌బోతోంద‌ని టీజ‌ర్‌తో రుజువైంది. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోను చీర‌కట్టి అమ్మోరు గెట‌ప్‌లో చూపించారు ద‌ర్శ‌కుడు సుకుమార్. చూడ‌బోతే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌కు పూన‌కాలు తెప్పించేలానే ఉంబోతున్నాయి.