Sreesanth: ఎన్టీఆర్‌కి నా డ్యాన్స్ న‌చ్చింది.. దేవ‌ర‌లో ఒక్క ఛాన్స్..!

Sreesanth: మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (JR NTR) న‌టిస్తున్న దేవ‌ర (Devara) సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వేడుకుంటున్నారు. క్రికెట‌ర్‌గా రాణించి ఆ రంగంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న శ్రీశాంత్..సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. హీరోగా ప‌లు సినిమాల్లో న‌టించారు. అయితే ఆయ‌న‌కు దేవ‌ర సినిమాలో ఓ అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఇటీవల హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ఈవెంట్‌కు హాజ‌రైన శ్రీశాంత్ మీడియా వ‌ర్గాల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాను జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని క‌లిసానని అన్నారు. త‌న డ్యాన్స్ బాగుంటుంద‌ని ఎన్టీఆర్ అన్నార‌ట‌. ఇప్పుడు ఎటూ ఎన్టీఆర్ దేవ‌ర సినిమాలో న‌టిస్తున్నారు కాబ‌ట్టి.. తన‌కు ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ను (Koratala Siva) అడుగుతున్నారు. (Sreesanth)

ALSO READ: Devara: ఈసారి క‌లిసొస్తుందా?

త్వ‌ర‌లో ఓ తెలుగు సినిమా కూడా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో ఆ సినిమా వివ‌రాల‌ను ప్రెస్ మీట్ ద్వారా వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. 2017లో వ‌చ్చిన అక్స‌ర్ 2తో (Aksar 2) శ్రీశాంత్ త‌న యాక్టింగ్ కెరీర్‌ను మొద‌లుపెట్టారు. త‌మిళంలో విజయ్ సేతుప‌తి (Vijay Sethupathi), స‌మంత (Samantha), న‌య‌న‌తార (Nayanthara) న‌టించిన క‌ణ్మ‌ని ర్యాంబో ఖ‌తీజా (Kanmani Rambo Khatija) సినిమాలో స‌మంత బాయ్‌ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించారు.

RRR సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవెల్‌కు చేరిపోయింది. ఇప్పుడు తార‌క్ బాలీవుడ్‌లో వార్ 2 (War 2) సినిమాను కూడా చేయ‌బోతున్నారు. దాంతో ఇత‌ర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీలు కూడా టాలీవుడ్ గురించి చెప్ప‌మంటే ఎన్టీఆర్ పేరు చెప్పి పాపులారిటీ తెచ్చుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇటీవ‌ల ప్ర‌ముఖ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మి (Mohammed Shami) తార‌క్ గురించి ప్ర‌స్తావించారు. త‌న‌కు టాలీవుడ్‌లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని అన్నారు.

దేవ‌ర గురించి మ‌రింత‌

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో జాన్వి క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సైఫ్ అలీ ఖాన్‌కు మ‌ధ్య‌లో చెయ్యి విర‌గ‌డం.. దానికి స‌ర్జ‌రీ అవ్వ‌డంతో ఆయ‌న‌పై ఎన్టీఆర్‌పై తీయాల్సిన స‌న్నివేశాలు ఆల‌స్యం అయ్యాయి. దాంతో సినిమాను ఈ ఏడాది ద‌స‌రాకు అక్టోబ‌ర్ 10న‌ రిలీజ్ చేస్తున్నారు.

ఇక దేవ‌ర షూటింగ్ మ‌రో 30 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. జాన్వి క‌పూర్, ఎన్టీఆర్ మ‌ధ్య‌లో సాంగ్స్ షూటింగ్ పార్ట్ మిగిలిపోయింది. ఈ సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ ట్రీట్ ఉండ‌బోతోందట‌. ఈ పాట కోసం ప్యాన్ ఇండియా హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేసారు. అయితే ఆ హీరోయిన్ ఎవ‌రు అనేది త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. కొర‌టాల శివ తార‌క్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ (Janatha Garage) సినిమాలో కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో (Kajal Agarwal) ప‌క్కా లోక‌ల్ అనే స్పెష‌ల్ సాంగ్‌ను పెట్టారు. ఇప్పుడు దేవ‌ర‌లో ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కిందో..!

ALSO READ: దేవ‌ర రాకుండానే ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌నా?

దేవ‌ర సినిమా కోసం తార‌క్ ఓ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని పెంచుకుంటూ పోవాలి కానీ ఎక్క‌డా కూడా త‌క్కువ కాకూడ‌దు అని తారక్ నిర్ణ‌యించుకున్నారు. అందుకే సినిమా కోసం ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. అదేంటంటే.. ఈ సినిమాను కేవ‌లం ప్ర‌మోట్ చేయ‌డానికి మాత్ర‌మే రెండు నెల‌ల స‌మ‌యాన్ని వెచ్చించ‌నున్నార‌ట‌. యావ‌త్ భార‌త‌దేశంలోని 27 న‌గ‌రాల్లో తారక్ దేవ‌ర సినిమాను ప్రమోట్ చేయ‌నున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువ‌గా సినిమాల‌కు సంబంధించి ప్ర‌మోష‌న్లు జ‌ర‌గ‌వు. కానీ ఎన్టీఆర్ ఆ ఈశాన్య ప్రాంతాల‌ను కూడా క‌వర్ చేయాల‌ని అనుకుంటున్నాడు.