terror attack: గ్రెనేడ్లతో జవాన్లపై ఉగ్రదాడి.. ఐదుగురి వీరమరణం

srinagar: జమ్ముకాశ్మీర్‌(Jammu and Kashmir) లోని పూంచ్‌ సెక్టార్‌ వద్ద ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు(terror attack) గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అయిదుగురు జావాన్లు(five soldiers killed) మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రుడిని వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భింబెర్ గలి ప్రాంతంలో వెళ్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ముష్కరులు గ్రెనేడ్లు ఉపయోగించారని వారు చెబుతున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ ను రాజౌరిలోని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుర్ఘటన జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఏప్రిల్ 21న ఎన్ఐఏ అధికారుల బృందం వెళ్లనుంది.

ఎప్పిటి నుంచో దాడి చేసేందుకు ప్రణాళిక రచించుకున్న ఉగ్రవాదులు.. గురువారం జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షం పడింది. దీంతో ఆ ప్రాంతం అంతా చీకటి పడినట్లు అయ్యింది. దీన్ని అదునుగా తీసుకున్న ఉగ్రవాదులు.. దాడులకు పాల్పడి ఉండవచ్చని.. ఉత్తర కమాండ్ ఆర్మీ హెడ్‌క్వాటర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాహనానికి నిప్పు అంటుకుందని.. అందుకనే తాము అది గ్రెనేడ్‌ దాడి అని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు జవాన్లు ఈ ఘటనలో అసువులుబాశారని ఆర్మీ పేర్కొంది. వాహనంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల పంజాబ్‌లోని బఠిండా సైనిక స్థావరంలో ఉగ్రవాదులు కాల్పుల జరిపారు. అది మరువకముందే.. ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఇక మే నెలలో జమ్ముకాశ్మీర్ వేదికగా జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగాల్సి ఉంది.