H3N8: చైనాలో మ‌రో వైర‌స్.. మొద‌టి మ‌ర‌ణం అక్క‌డే!

Beijing: చైనా(china)నుంచి మ‌రో వైర‌స్(virus) వ‌ణుకుపుట్టిస్తోంది. ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెన్జా(avian influenza) అనే H3N8 వైర‌స్‌కు సంబంధించి మొద‌టి కేసు, మొద‌టి మ‌ర‌ణం కూడా చైనా(china)లోనే న‌మోదైంది. H3N8 అనేది బర్డ్ ఫ్లూ. ఇప్ప‌టికే చైనాలో ముగ్గురు ఈ వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్ల‌డించింది. అయితే ఇది కోవిడ్(covid) లాగా ఒక‌రి నుంచి మ‌రొక‌రి సోకేది కాద‌ని అంటున్నారు. చైనా నుంచి ఈ వైర‌స్ వేరే ప్రాంతాల‌కు సోకే ఛాన్సులు కూడా త‌క్కువే. కాబ‌ట్టి బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. చైనా(china)కు చెందిన 56 ఏళ్ల మ‌హిళ నుమోనియాతో హాస్పిట‌ల్‌లో చేరారు. ఈ వైర‌స్ కార‌ణంగా ఆమెకు ఈ నుమోనియా సోకింద‌ని, వ్యాధి తీవ్రం కావ‌డంతో ఆమె చ‌నిపోయింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆమె కోళ్ల ఫారంలో ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది కాబ‌ట్టే వైర‌స్ సోకింద‌ని స్ప‌ష్టం చేసారు.

H3N8 అంటే ఏంటి?

2002 నుంచి ఈ వైర‌స్ వ్యాపిస్తోంది. మొద‌టి కేసు నార్త్ అమెరికాలో న‌మోదైంది. గుర్రాలు, కుక్కలు, ప‌క్షుల‌కు సోకేది. జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోక‌డం అరుదుగా చూస్తుంటాం. ఎక్కువ‌గా కోళ్ల ఫారం, జంతువుల‌ను ఉంచే షెడ్ల‌లో ప‌నిచేసేవారికి సోకే ఛాన్స్ ఉంది. ఈ వైర‌స్ సోకిన‌ప్పుడు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌చ్చు, లేదా ఆయాసం వంటివి వ‌చ్చి చనిపోయే ఛాన్సులు కూడా ఉండొచ్చు. ఈ వైర‌స్‌కి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. పౌల్ట్రీ, మాంసం కొట్ల‌లో ప‌నిచేసేవారు జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిది.