Warangal: ప్రేమ వివాహం.. పెళ్లి చేసినవారి ఇంటికి నిప్పు
Warangal: కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని తండ్రి ఆ యువకుడి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన వరంగల్‌లో (warangal) చోటుచేసుకుంది. వరంగల్‌కు చెందిన యువ జంట కావ్య, రంజిత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రంజిత్ SBI బ్యాంక్ ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కావ్య తండ్రి యువతి తండ్రి ఇటుకాలపల్లి సర్పంచ్. రంజిత్‌తో పెళ్లి ఇష్టంలేని కావ్య తండ్రి తెగేసి చెప్పాడు. దాంతో రంజిత్ స్నేహితులు దగ్గరుండి వారిద్దరికీ గుడిలో పెళ్లి జరిపించారు. విషయం తెలిసి కావ్య తండ్రి రంజిత్, అతని ఫ్రెండ్స్ ఇంటికి నిప్పు పెట్టాడు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు.