మాధురీ దీక్షిత్ ఇంట విషాదం!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, అలనాటి అందాల తార మాధురి దీక్షిత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాధురీ తల్లి స్నేహలతా దీక్షిత్ (91) మృతి చెందారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె అంత్యక్రియలు ముంబైలో నిర్వహించనున్నారు. తన తల్లి మరణంపై మాధురి దీక్షిత్ సోషల్ మీడియాలో ‘ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తే స్వర్గానికి పయనమైంది’ అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. మాధురీ తల్లి మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, బాలీవుడ్ వర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
మాధురీ దీక్షిత్ ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా, డ్యాన్స్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసి 1990లలో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఖల్‌నాయక్ మూవీలో చోళీకే ఫీచే క్యా హై అనే సాంగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 1998లో డా. శ్రీరామ్ నేనేని వివాహం చేసుకుని.. యూఎస్‌లో సెటిల్ అయ్యారు. చాలా సంవత్సరాలు అక్కడే ఉన్న ఈ నటి ఇటీవలే ఇండియా తిరిగొచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
దాదాపు పదేళ్ల పాటు డ్యాన్స్ క్వీన్‌గా తన పాటలు, డ్యాన్స్, సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌నే కాదు. సౌత్‌లో కూడా మాధురి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జీగా, కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తోంది మాధురి దీక్షిత్. సినిమాల్లో కనిపించకపోయినా మాధురి దీక్షిత్ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన షోలు, పర్సనల్ లైఫ్‌కి చెందిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు మాధురీ. 1984లో విడుదలైన అబోద్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనీల్ కపూర్‌తో కలిసి తేజాబ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆ తర్వాత వరుస హిట్‌లు రావడంతో బాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్‌గా మారిపోయారు.