ఎంసెట్‌ నోటిఫికేషన్‌.. మార్చి 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం!

2023‌‌-24 సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌ (EAMCET) నోటిఫికేషన్‌ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌, మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎంసెట్‌ షెడ్యూల్‌..

*ఎంసెట్‌ నోటిఫికేషన్‌- ఫిబ్రవరి 28న

*ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)

*దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్‌ 10 (అపరాద రుసుము లేకుండా)

*రూ.250 ఫైన్‌తో- ఏప్రిల్‌ 15

*రూ.1000 అపరాద రుసుముతో- ఏప్రిల్‌ 20

*రూ.2500 ఫైన్‌తో- ఏప్రిల్‌ 25

*రూ.5000 అపరాద రుసుముతో- మే 2

*దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

*హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌- ఏప్రిల్‌ 30 నుంచి

*పరీక్ష తేదీలు- మే 7 నుంచి 11 వరకు

పీజీఈసెట్‌ షెడ్యూల్‌..

2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌-2023 (PGECET) షెడ్యూల్‌ను కూడా ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ ఈ నెల 28న విడుదల కానుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు కొనసాగనుంది. పరీక్షలను మే 29 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహిస్తారు.

*పీజీసెట్‌ నోటిఫికేషన్‌- ఫిబ్రవరి 28న

*ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)

*దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్‌ 30 (అపరాద రుసుము లేకుండా)

*రూ.250 ఫైన్‌తో- మే 5

*రూ.1000 అపరాద రుసుముతో- మే 10

*రూ.2500 ఫైన్‌తో- మే 15

*రూ.5000 అపరాద రుసుముతో- మే 24

*దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

*హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌- మే 21 నుంచి

*పరీక్ష తేదీలు- మే 29 నుంచి జూన్‌ 1 వరకు